man being washed away in floodwater in Hyderabad వర్షం నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. కాపాడిన రేషన్ డీలర్..

Man being washed away in floodwater at yousufguda in hyderabad

Rains thrashes man in flooded water, man washed away by flooded water in yousufguda, Aged Man, washed away, Floodwater, Krishnanagar, Yousufguda, Viral, Social Media, Hyderabad, Telangana, Politics

An elderly man aged 64 years had washed away in floodwater while trying to hold a scooter near Vidyaniketan High School at Krishnanagar in Yousufguda, Hyderabad. The visuals of him being washed away went viral on social media.

ITEMVIDEOS: వర్షం నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. కాపాడిన రేషన్ డీలర్..

Posted: 10/01/2019 05:28 PM IST
Man being washed away in floodwater at yousufguda in hyderabad

హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఇక, పొంగిపొర్లుతున్న నాలాలు రోడ్లను కాలువల్లను తలపిస్తున్నాయి. కాంక్రీట్ జంగిల్ లో వున్న కాలువలు, నాలాలను, చివరకు చెరువులను కూడా కబ్జాదారులు తమ కబంధ హస్తల్లోకి తీసుకుని వాటిని కనుమరుగు చేసిన పలితమే ఈ ఘటన.

ఇటీవల కురిసిన వర్షానికి భారీగా ప్రవాహంతో పొటెత్తిన వరద నీరు తమ సహజమార్గంలో గమ్యస్థానం చేరుకోలేక నగరంలోని రోడ్ల మీదుగానే తమ పయనాన్ని సాగించింది. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో నడిరోడ్డుపై వృద్దాప్యంలోని ఓ వ్యక్తిని వర్షం నీరు కొట్టుకుపోయాడు. వర్ష నీటిలో కొట్టుకుపోతున్న తన స్కూటర్ ను లాగబోయిన ఆయన.. అదుపుతప్పి నీళ్లలో కొట్టుకుపోయారు. నెట్టింట్లో ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.

వరద నీటిలో కొట్టుకుపోయిన ఆయనను అక్కడే వున్న కొందరు చూసినా.. కాపాడే ధైర్యం చేయలేకపోయారు. అందుకు ఉదృతంగా  ప్రవహిస్తున్న వరద నీరే కారణం. అయితే ఇలా సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకుపోయిన ఈ వ్యక్తిని ఓ రేషన్ షాపు డీలర్ చూసి కాపాడాడు. అతడ్ని సురక్షితంగా వారింటికి చేర్చారు. ఈ విషయమై స్పందించిన ఆయన భార్య.. మాట్లాడుతూ తన భర్త తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. కాళ్లు, చేతులు, వీపు, చాతికి దెబ్బలు తగిలాయని అమె అవేదన వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aged Man  Floodwater  Krishnanagar  Yousufguda  Viral  Social Media  Hyderabad  Telangana  Politics  

Other Articles