Laxmi Parvathi on Kodela Son and Daughter కొడెల కొడుకు, కూతురిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Laxmi parvathi sensational comments on former speaker kodela son and daughter

Kodela shiv prasad, former speaker, Laxmi Parvathi, Son Shivaram, Daughter Vijaya Laxmi, guntur, Andhra Pradesh, Crime

Former Chief Minister NTR's Wife Laxmi parvathi had made sensational comments on former Speaker Kodela Siva Prasad Rao son shivaram and dauthter vijaya lakshmi.

కొడెల కొడుకు, కూతురిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Posted: 09/28/2019 01:58 PM IST
Laxmi parvathi sensational comments on former speaker kodela son and daughter

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలతో పాటు ఆయన కుటుంబంపై ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ గా పదవీ బాద్యతలు నిర్వహించిన కోడెల శివప్రసాద్.. ఆ పదవికి అపఖ్యాతి తీసుకువచ్చారని అమె విమర్శించారు. స్పీకర్ పదవిలో కొనసాగుతూనే ఆయన విలువైన రాష్ట్ర సంవదగా భావించాల్సిన అసెంబ్లీ ఫర్నీచర్ ను తన కార్యాలయంలోకి ఎలా తీసుకెళ్లారని ఆమె ప్రశ్నించారు.

అంతటితో ఆగని అమె ఆయన సంతానంపై కూడా విమర్శలు గుప్పించారు. ఆయనకు ఉన్న కొడుకు, కూతురు లాంటి వ్యక్తులు మరెవరికి ఉండకూడదని అన్నారు. కోడెల ఏం తప్పు చేయలేదా ? ఆయన కుటుంబం కూడా ఏ తప్పు చేయలేదా అని ప్రశ్నించారు. కొడెలకు ఓ రౌడీ కొడుకు, పనికిమాలిన కూతురు ఉన్నారన్నారు. అలాంటి సంతానం మరెవరికి ఉండకూడదన్నారు. పుత్రప్రేమను అధికంగా చూపించేవాడు ఎలా నష్టపోతాడన్న దానికి మహాభారతంలో దృతరాష్ట్రుడు ఉదాహరణగా మిగిలాడన్నారు. ఆ తర్వాత కోడెల శివప్రసాద్ మనకు మంచి ఉదాహరణ అన్నారు.

ఆయన స్వతహాగా మంచివాడైనా కొడుకు కూతురు వల్లే తీవ్రంగా నష్టపోయారన్నారు లక్ష్మీ పార్వతి. మరోవైపు ఇదే విషయంలో మాజీ సీఎం చంద్రబాబుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. కోడెల చావును కూడా చంద్రబాబు రాజికీయం చేశారన్నారు. కోడెలకు కనీసం చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.  చనిపోయిన తర్వాత మాత్రం  కోడెల శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారన్నారు. నీచమైన కుట్రలు చంద్రబాబు ఆపరా అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు ఒకే రకమైన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles