chinmayanand sent to 14 day judicial custody చిన్మయానందకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Rape accused chinmayanand arrested by sit sent to 14 day judicial custody

chinmayanand arrested in sexual assault case, chinmayanand sexual harassment case, chinmayanand judicial custody, uttar pradesh police delay in chinmayanand arrest, uttar pradesh government, yogi adityanath, chinmayanand, sexual harassment, former bjp union ministet, social media, police, uttar pradesh, crime

Former BJP MP Chinmayanand, accused of raping a law student, was on Friday arrested by the Uttar Pradesh SIT from his residence in UP’s Shahjahanpur. He has been sent to 14-day of Judicial custody.

బీజేపి నేత చిన్మయానందకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Posted: 09/20/2019 01:59 PM IST
Rape accused chinmayanand arrested by sit sent to 14 day judicial custody

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్వామి చిన్మయానంద్‌ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. తన ఆశ్రమంలోని మహిళలపై ఆయన అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ యువతి గత నెల 24న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆధారంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నెట్టింట్లో ఈ పోస్టు పెట్టిన యువతి.. తనపై కూడా చిన్మయానంద ఏడాది పాటు అత్యాచారం చేశాడని అరోపణలు చేయడంతో పోలీసులు చిన్మయానంద్ ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే సదరు బాధితురాలు తనపై చిన్మయానంద్ అత్యాచారానికి పాల్పడ్డాడని నిరూపించేందుకు తగు ఆధారాలు ఉన్నాయని మీడియాతో  వెళ్లడించింది. దీంతో ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటుచేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో చర్యలు ప్రారంభించిన యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది.

సిట్ విచారించినా చిన్మయానందపై కేసు నమోదు చేయకపోవడంతో పోలీసులు తీరుపై బాధితురాలు అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోతేగానీ చిన్మయానంద్‌పై కేసు పెట్టరేమోనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యువతి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకముదే రంగరంలోకి దిగిన పోలీసులు శుక్రవారం ఆయనను ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చిన్మయానంద్ ను షహారన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్మయానంద్‌ను షహారన్‌పూర్‌లోని ఆయన ఆశ్రమంలో అరెస్ట్ చేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. చిన్మయానంద్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నావో రేప్ కేసు నిందితుడి కూడా కాపలా కాస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం చిన్మయానంద్ విషయంలోనూ ఇలాంటి వైఖరే అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. బాధితురాలు భయపడుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందో తనకు అర్ధం కావడంలేదని ప్రియాంక నిలదీశారు. మరోవైపు, చిన్మయానంద్‌ను తక్షణమే అరెస్ట్ చేయకపోతే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడతానని బాధిత యువతి పోలీసులను హెచ్చరించింది.కాగా, ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్ శుక్లా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో చట్టం ముందు అందరూ సమానమేనని, సిట్ తన పనితాను చేసుకెళుతుందని అన్నారు.

చిన్మయానంద్ అరెస్ట్ అనివార్యమైతే సిట్ తప్పకుండా అదుపులోకి తీసుకుంటుందని, శాంతి భద్రతల విషయంలో తాము రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. యూపీలోని పలు ఆశ్రమాలు, విద్యా సంస్థలు నిర్వహించే స్వామి చిన్మయానంద్‌పై 2011లోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన విద్యా సంస్థల్లో ఎంఎల్ చదువుతోన్న బాధిత యువతి.. బ్లాక్‌మెయిల్‌ చేసి తనపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించింది.

ఏడాది పాటు చిన్మయానంద తనపై అత్యాచారం చేశాడని, దీనికి తన దగ్గర పక్కా ఆధారాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.సాక్ష్యాలను తగిన సమయంలో సిట్‌కు అందజేస్తానని ఆమె తెలిపింది. నేను, నా కుటుంబం భద్రత కోసమే ఓ వీడియోను పోస్ట్ చేయాల్సి వచ్చిందని, లేకపోతే చిన్మయానంద తనను చంపేసేవాడని మీడియా ముందు పేర్కొంది. షాజహాన్‌పూర్ పోలీసులు రేప్ కేసు నమోదుచేయలేదని, అధికారులు సహకరించకపోవడంతోనే నన్ను నేను రక్షించుకోడానికే పారిపోవాల్సి వచ్చిందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh