thousands participated in kodela last journey కోడెల అంతిమయాత్ర.. జనసంధ్రమైన నరసరావుపేట

Thousands participated in kodela siva prasada rao last journey

kodela siva prasad, last rites, funeral, sattenapalli, swarnapuri, sivaram, kodela suicide, kodela shiva prasad suicide attempt, kodela suicide, Vendetta politics, YSR Congress Party, Y. S. Rajasekhara Reddy, Telugu Desam Party, Nara Lokesh, Chandrababu, Guntur, Vijayawada, Andhra Pradesh, Politics

Andhra Pradesh former speaker Kodela Siva Prasada Rao's last journey is conducted from his house at kota to swarnapuri, with his party TDP chief Chandrababu Naidu and Leaders along with thousands of his followers, fans,

కోడెల అంతిమయాత్ర.. జనసంధ్రమైన నరసరావుపేట

Posted: 09/18/2019 03:34 PM IST
Thousands participated in kodela siva prasada rao last journey

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర ఆయన స్వగృహమైన కోట నుంచి బయలుదేరింది. రెండు కిలోమీటర్ల దూరంలో వున్న స్వర్ణపురిలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కిలోమీటరు దూరం పాటు ఆయన అంతిమయాత్ర సాగనుంది. ఈ అంతమయాత్రంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నేతలు నారా లోకేష్, బాలకృష్ణ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, దేవినేని ఉమ, నారాయణ, సహా పలువురు అగ్రనేతలు అంతిమయాత్రలో నడుస్తూ పాల్గోన్నారు.

నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెలకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో భాగంగా సాగిన అంతిమయాత్రంలో అటు కోడెలఅంతిమయాత్ర వాహనంపై స్థానికులు పూల వర్షం కురిపించారు. ఆయనతో పాటు యాత్ర ముందర నడిచిన చంద్రబాబుపై కూడా పూల వర్షం కురిపించారు, కిలోమీటరు దూరం వరకు సాగిన ఈ యాత్రలో వేలాదిగా టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గోనడంతో రెండు గంటలు సాగుతుందని భావించిన యాత్రం ఏకంగా మూడు గంటలకు పైగా సాగుతుందని అధికారులు, పోలీసులు భావిస్తున్నారు.

కోడెల అంతిమయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడెల నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కోడెల శివప్రసాదరావుకు సంతాపం తెలుపుతూ నరసరావుపేట పట్టణంలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలో బంద్ పాటించనున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది. తమ ప్రియనేత ఆకస్మిక మరణంతో దు:ఖసాగరంలో మునిగిన అభిమానులు నరసరావుపేటకు తరలివచ్చారు,

కడసారి చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోడెల సేవలను గుర్తు చేసుకుంటున్నారు. నరసరావుపేట అభివృద్ధి ఆయన చలవేనంటూ గుర్తుచేసుకుంటున్నారు. కోడెల లాంటి నాయకుడు మళ్లీ రాలేడని చెబుతున్నారు. నరసరావుపేటకు నీటి కొరత లేకుండా చేసిన గొప్పనాయకుడని కితాబిస్తున్నారు. పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కోటప్పకొండను ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిదంటూ కోడెల సేవలను స్మరించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodela siva prasad  last rites  funeral  sattenapalli  swarnapuri  TDP. YSRCP  Andhra Pradesh  Politics  

Other Articles