kodela siva prasada rao funeral tomorrow ప్రభుత్వ లాంఛనాలతో రేపు కోడెల అంత్యక్రియలు..

Kodela siva prasada rao last rites to be conducted tomorrow

kodela siva prasad, last rites, funeral, sattenapalli, sivaram, kodela suicide attempt, kodela shiva prasad suicide attempt, kodela suicide, Vendetta politics, YSR Congress Party, Y. S. Rajasekhara Reddy, Telugu Desam Party, Nara Lokesh, Chandrababu, Guntur, Vijayawada, Andhra Pradesh, Politics

Andhra Pradesh former speaker Kodela Siva Prasada Rao's last rites to be held tomorrow after his son sivaram arrives from foreign. who had declared dead after suicide attempt today,

ప్రభుత్వ లాంఛనాలతో రేపు కోడెల అంత్యక్రియలు..

Posted: 09/17/2019 02:01 PM IST
Kodela siva prasada rao last rites to be conducted tomorrow

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖలకు అదేశాలను జారీ చేశారు. రాష్ట్ర హోం మంత్రిగా, ఇరిగేషన్ శాఖ, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా సేవలు అందించి చివరగా అంధ్రప్రదేశ్ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.

కోడెల మరణం వెనక రాజకీయకక్షలు ఉన్నాయన్నది టీడీపీ వర్గాల వాదన. మానసిక వేదన భరించలేక ఆయన సూసైడ్ చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల ఆత్మహత్యపై టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ కోడెలది ఎలాంటి మరణం అన్నది పోలీసులు ఇవాళ స్పష్టం చేయనున్నారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం... కోడెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో టిఫిన్ చేసి... 10.10కి బెడ్‌రూంకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు.

ఆ సమయంలో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు సహా ఏడుగురు ఉన్నారు. 10.40కి ఆయన్ని బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్ పడిపోయినా.. ఆయనను బతికించేందుకు 40 నిమిషాల పాటు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించగా, అది ఇవాళ పోలీసులకు అందుతుంది. దీంతో కోడెలది ఆత్మహత్యే.? లేక ఎలాంటి మరణమన్న విషయం రూడీ కానుంది.

టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు, అనుచరగణం సందర్శనార్థం ఆయన బౌతిక ఖాయాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు తరలించగా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. కాగా, ఇవాళ కోడెల పార్థివదేహాన్ని ఇవాళ గుంటూరు జిల్లాలోని నరసారావు పేటకు తరలిస్తారు. సాయంత్రం నర్సారావుపేటలోని కోడెల స్వగృహానికి చేరనున్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodela siva prasad  last rites  funeral  sattenapalli  shivaram  TDP. YSRCP  Andhra Pradesh  Politics  

Other Articles