Kodela Siva Prasad Rao suicide attempt పరమపదించిన పల్నాటి పులి..కొడెల శివప్రసాద్..

Kodela siva prasad rao suicide attempt agianst vendetta politics

Kodela Shiva Prasad, kodela suicide attempt, kodela shiva prasad suicide attempt, kodela suicide, Vendetta politics, YSR Congress Party, Y. S. Rajasekhara Reddy, Telugu Desam Party, Nara Lokesh, Chandrababu Naidu, Guntur, Vijayawada, Andhra Pradesh, Politics

Kodela Siva Prasada Rao one of the well-known politicians from the Telugu Desam Party has made suicide attempt following vendetta politics by ruling party in the state, Doctors say his is critical.

పరమపదించిన పల్నాటి పులి..కొడెల శివప్రసాద్..

Posted: 09/16/2019 12:51 PM IST
Kodela siva prasad rao suicide attempt agianst vendetta politics

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను ఐసీయూలో ఉంచిన వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడిన ఆయనను వెంటిలేటర్ పై వుంచి చికిత్సను అందించారు వైద్యులు.

ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు అప్పటికే సమాచారం అందించిన వైద్యులు ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చిరవకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై కొడెల శివప్రసాద్ చికిత్స పోందుతూనే తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా, ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల శివప్రసాదరావు, ఆకస్మిక మరణం ఆయన అనుయాయువులను, అనుచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురించేసింది

గత కొన్ని రోజులుగా, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పరువు తీయాలని చూస్తున్నారని కోడెల ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వైసీపీ నేతలకు విన్నతి కూడా చేశారు. ముఫ్పై ఏళ్లుకు పైగా రాజకీయాలలో వున్నానని.. ఎన్నో పదవులు అలకరించానని, అలాంటి తాను ప్రతిపక్షంలో వుంటే తనపై కక్షపూరిత రాజకీయాలు చేసి.. కేసులు బనాయించడం సముచితం కాదని కూడా కోరారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల, ఇంతటి ఘోరమైన నిర్ణయం తీసుకుని ఉంటారని ఇంటి సభ్యులు విలపిస్తూ చెప్పారు. ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కోడెలకు చికిత్స జరుగుతుండగా, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక కోడెల ఉరి వేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశారని తెలుసుకున్న ఆయన అభిమానులు, పలువురు తెలుగుదేశం నేతలూ, ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kodela Shiva Prasad  Vendetta politics  TDP. YSRCP  Guntur  Andhra Pradesh  Politics  

Other Articles

 • Kcr not interested to retain the sacked tsrtc employees

  చర్చలు లేవ్.. హైకోర్టు ఆదేశాలపై సీఎం విముఖత..

  Oct 17 | సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై... Read more

 • Tsrtc strike high court orders government to pay workers salaries

  ఆర్టీసీ కార్మికులకు ఊరట.. జీతాలు చెల్లింపుకు హైకోర్టు అదేశం

  Oct 16 | ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తున్న అర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. సమ్మె నేపథ్యంలో కార్మికుల వేతనాలను నిలిపివేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేసిన... Read more

 • Hearing ends in ayodhya case ends supreme court reserves verdict

  అయోధ్య కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు..

  Oct 16 | శాతాబ్దాల క్రితం నాటి అయోధ్య రామజన్మభూమికి సంబంధించి దశాబ్దాలుగా సాగుతున్న వివాదాస్పద కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును రిజర్వు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఏర్పడిన... Read more

 • Case against cinepolis in hyderabad for delaying movie by 10 mins

  థియేటర్ యాజమాన్యానికి సినిమా చూపిన ప్రేక్షకుడు

  Oct 16 | థియేటర్ యాజమాన్యానికి ఓ ప్రేక్షకుడు సినిమా చూపించిన ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో అసలు ట్విస్టు ఏంటంటే.. నిర్దేశిత సమయం కంటే సినిమా పది నిమిషాలు అలస్యంగా... Read more

 • Pawan kalyan slams ys jagan govt on rythu bharosa promise

  రైతుభరోసాపై జగన్ సర్కార్ కు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న.!

  Oct 16 | వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చలేదని  విమర్శించారు. ప్రతి... Read more

Today on Telugu Wishesh