Delhi court extends ex-FM's CBI custody till 5th Sept చిదంబరానికి ఊరట.. సిబిఐ కస్టడీ 5 వరకు పెంపు

Delhi court extends ex fm s cbi custody till 5th sept in accordance with sc order

2018 Supreme Court order on mining,chidambaram news,chidambaram p,Delhi,ED,ed inx media case in hindi,డhidambaram Latest News,Indrani Mukerjea,InMyOpinion,inx full form,INX Media,INX Media case,Kapil Sibal,Karti Chidambaram, p chidambaram cbi case,P Chidambaram hearing,p chidambaram, p chidambaram news,P. Chidambaram,Sohrabuddin Sheikh fake encounter case,Supreme Court,Tushar Mehta,what is inx media case, Crime

A special CBI court in Delhi extended P Chidambaram's CBI custody till 5 September, in accordance with the Supreme Court order. Chidambaram was produced before the Delhi court on expiry of his one-day CBI custody in the INX Media corruption case.

చిదంబరానికి ఊరట.. సిబిఐ కస్టడీ 5 వరకు పెంపు

Posted: 09/04/2019 03:15 PM IST
Delhi court extends ex fm s cbi custody till 5th sept in accordance with sc order

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. తీహార్ జైలుకు ఆయనను తరలించేందుకు సీబిఐ అధికారులు సిద్దంమవుతున్న నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు ఊరటను కల్పించింది. చిదంబరం బెయిల్ పిటీషన్ పై నిర్ణయం తీసుకునేంతవరకు ఆయనను తీహార్ జైలుకు పంపరాదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఇక ఆయన సీబీఐ కస్టడీని సెప్టెంబర్‌ 5వరకూ సుప్రీం కోర్టు పొడిగించింది.

కేంద్రమాజీ మంత్రిని ఇప్పుడే తీహార్‌ జైలుకు తరలించరాదని అత్యున్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు పేర్కొంది. అరెస్ట్‌ వారెంట్ కు వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను ఈనెల 5న విచారణకు చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం తదుపరి కస్టడీ అవసరం లేదని, ఆయనను జ్యడిషియల్‌ కస్టడీ కింద తీహార్‌ జైలుకు తరలించాలని సీబీఐ వాదించింది.

చిదంబరం తరపు న్యాయవాదులు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకువచ్చారని సాలిసిటర్ జనరల్ తుహార్ మెహతా వ్యాఖ్యానించారు. కాగా, చిదంబరం బెయిల్ పిటీషన్ పై చర్చించాల్సిందేనని కపిల్ సిబాల్ ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే ఇందుకు న్యాయస్థానం విముఖత చూపడం లేదని, కాగా, మధ్యంతర ఉత్తర్వులు మరో రెండు రోజులు కొనసాగనని న్యాయస్థానం పేర్కోంది. దీంతో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను సవాల్‌ చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 5న విచారిస్తామని జస్టిస్‌ ఆర్‌ భానుమతి, ఏఎస్‌ బొపన్నలతో కూడిన అతున్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది. దిగువ కోర్టుల అధికార పరిధిలో తాము జోక్యం చేసుకోరాదని తాము గుర్తెరిగామని వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  chidambaram  inx media  Indrani Mukerjea  Kapil Sibal  Tushar Mehta  Crime  

Other Articles