Vodafone Idea min recharge plan down to Rs 20 వోడాఫోన్ బంఫర్ ఆపర్.. కనిష్ట రిచార్జ్ ధర తగ్గింపు.!

Voda idea turns to cheap recharges for regaining 14 mn lost subscribers

Vodafone Idea, minimum recharge plan, Rs 20, Airtel, Tata Docomo, prepaid subscribers, Reliance Jio, 14 mn subscribers, monthly validity plan

Vodafone Idea has lowered the minimum recharge plan from Rs 24 to Rs 20 now, after revised their minimum recharge earlier this year. Rs 20 prepaid plan is available for both, Vodafone and Idea Cellular users. It is an open market plan available for all prepaid subscribers.

వోడాఫోన్ బంఫర్ ఆపర్.. కనిష్ట రిచార్జ్ ధర తగ్గింపు.!

Posted: 09/03/2019 04:59 PM IST
Voda idea turns to cheap recharges for regaining 14 mn lost subscribers

మీరు వొడాఫోన్, ఐడియా కస్టమర్లా.? అయితే మీకు మీ సర్వీస్ ప్రోవైడర్ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం 24 రూపాయలకే నెల(30) రోజులకు వ్యాలిడిటీతో రిచార్జ్ అవకాశాన్ని కల్పిస్తూ ఈ ఏడాది ప్రారంభంలోనే తమ మినిమమ్ రిచార్జ్ ను సవరించిన వోడాఫోన్ ఐడియా టెలిసర్వీస్ కంపెనీ.. తాజాగా మరోమారు అంతకన్నా తక్కువ ధరకు వ్యాలిడిటీ రీచార్జ్ అవకాశాన్ని కల్పిస్తూ మరో ఆపర్ కల్పించింది. తమ నెట్ వర్క్ పరిధిలో వున్న కస్టమర్లను అంటిపెట్టుకునేందుకు ఈ సంస్థ మరో అడుగు ముందుకేసి తాజా ఆఫర్ ను ప్రకటించింది.

ఇప్పటికే ఈ నెట్ వర్క్ పరిధిలోని 14 మిలియన్ కస్టమర్లను పోగొట్టుకున్న ఈ టెలీసర్వీస్ ప్రోవైడర్.. ఇక ఉన్న కస్టమర్లను కాపాడుకునే వేటలో పడింది. అంతే అందుకోసం మిగిలిన టెలికాం సంస్థలు ఏవీ ప్రకటించని విధంగా కేవలం 20 రూపాయలకే మినిమమ్ రీచార్జ్ వ్యాలిడిటీని ప్రకటించింది. గతంలో మినిమమ్ రీఛార్జ్ రూ.35 ఉండేది. ఈ ఏడాది ఆరంభంలో ఆ ధరను 24కు తగ్గించింది. ఇక తాజాగా ఇప్పుడు ఆ రీఛార్జ్ ను రూ.20 కి తగ్గించింది. మార్కెట్‌లో పట్టు కోల్పోకుండా ఉండటంతో పాటు యూజర్ బేస్‌ తగ్గకుండా చూసేందుకు వొడాఫోన్ ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తోంది.

మినిమమ్ రీఛార్జ్ ద్వారా వొడాఫోన్ ఐడియాకు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. రూ.20 రీఛార్జ్ చేసిన వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 28 రోజుల వేలిడిటీతో పాటు టాక్ టైమ్ కూడా లభిస్తుంది. గతంలో రూ.24 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వ్యాలిడిటీ వచ్చేది. వ్యాలిడిటీ రెండు రోజులు తగ్గినా రీఛార్జ్ ప్లాన్ పై మాత్రం భారీ తగ్గింపు లభించినట్టే. వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ ఎయిర్ టెల్ కూడా డేటా, కాలింగ్ ధరల్ని భారీగా తగ్గిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vodafone Idea  minimum recharge plan  Rs 20  Airtel  Tata Docomo  prepaid subscribers  Reliance Jio  

Other Articles