Mobile Wallets KYC time extended till February డిజిటల్ వ్యాలెట్ల కేవైసీకి గడుపు పెంపు

Mobile wallets have time till february 2020 to update kyc

KYC linking, paytm wallet, paytm kyc, phonepe kyc, amazon pay kyc, google pay kyc, true caller kyc, mobile wallet kyc, reserve bank of indi, RBI, digital wallets, E wallet

The Reserve Bank of India (RBI) has extended the deadline for digital wallets to become fully Know Your Customer (KYC) compliant by six months.

డిజిటల్ వ్యాలెట్ల కేవైసీకి గడుపు పెంచిన రిజర్వు బ్యాంకు

Posted: 09/03/2019 03:34 PM IST
Mobile wallets have time till february 2020 to update kyc

మొబైల్ వినియోగదారులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గుడ్ న్యూస్ అందించింది. మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో డిజిటల్ వ్యాలెట్ ను వినియోగించే వారికి ఊరటను కల్పించ్చింది. సర్వసాధారణంగా స్మార్ట్ పోన్లు వున్న ప్రతీ ఒక్కరు ఏదో ఒక సందర్భంలో పేటియం, ఫోన్ పే, అమజాన్ పే, గూగుల్ పే, సిట్రస్ పే, మోబీవిక్, తదితర మొబైల్ వ్యాలెట్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇన్నాళ్లు వేరు.. ఇక మీద వేరు.. అన్నట్లు భారతీయ రిజర్వుబ్యాంకు డిజిటల్ పేమెంట్స్ జరిపేవారికి తప్పకుండా కేవైసీ ద్వారా వారి పూర్తి వివరాలు పోందివుండాలని అదేశాలు జారీ చేసింది.

అంతేకాదు కేవైసీ వివరాలను తెలుపని కస్టమర్ల వాలెట్లను డీ అక్డివేట్ చేయాలని కూడా అదేశాలు జారీ చేసింది. దీంతో అనేకమంది మొబైల్ వ్యాలెట్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో తమకు కొంత గడువుఇస్తే కేవైసీ చేయించుకుంటామని డిజిటల్ వ్యాలెట్ దారులు కొరడంతో.. స్పందించిన రిజర్వు బ్యాంకు మొబైల్ వ్యాలెట్ దారులకు ఆరు మాసాల గడువుని పెంచింది.

కేవైసీ చేయించుకోవడానికి 2020 ఫిబ్రవరి 29వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు అందరూ మొబైల్ యూజర్లు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి మొబైల్ వ్యాలెట్స్ వాడుతున్నారు. వీటి ద్వారానే చాలావరకు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అనేక రకాల పేమెంట్స్ క్షణాల్లో అయిపోతున్నాయి. వీటికి కేవైసీ చేయించుకోవాలని ఆర్బీఐ చెప్పింది. దాని కోసం గతంలో ఆగస్ట్ 31 డెడ్ లైన్ పెట్టింది. ఆలోగా కేవైసీ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి మొబైల్ వ్యాలెట్స్ పనిచేయవు అని చెప్పింది.

తాజాగా గడువు తేదీని ఆర్బీఐ పొడిగించింది. దీంతో మొబైల్ వ్యాలెట్ కంపెనీలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి. తాజా ఉత్తర్వులతో ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర వ్యాలెట్స్ వాడేవారు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు చేసుకోవచ్చు. అయితే కేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని చెప్పింది. ఫిబ్రవరి 29 తర్వాత గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KYC linking  paytm wallet  paytm kyc  phonepe kyc  amazon pay kyc  google pay kyc  digital wallet  

Other Articles