YONO digital banking to replace all SBI debit cards డెబిట్ కార్డులకు ఎస్బీఐ మంగళం.. మరి విత్ డ్రా ఎలా.?

Sbi aims to eliminate debit cards to promote digital transactions

sbi yono, sbi yono banking, sbi yono atm cash, sbi cardless atm withdrawal, sbi yono cash, sbi yono atm, state bank of india, sbi atm, sbi debit card, sbi digital transactions, sbi yono app

In the coming years, SBI wants its consumers to get rid of their debit cards and use their mobile phones for withdrawing cash or making payments.

ఐదేళ్లలో డెబిట్ కార్డులకు ఎస్బీఐ మంగళం.. మరి డబ్బు విత్ డ్రా ఎలా.?

Posted: 08/20/2019 06:15 PM IST
Sbi aims to eliminate debit cards to promote digital transactions

ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా అవతరించిన భారతీయ స్టేట్ బ్యాంకు మరో సంచలనానికి కూడా తెరలేపనుంది. త్వరలోనే డెబిట్ కార్డులను అదృశ్యం చేయనుంది. ప్రధాని నరేంద్రమోడీ నోట్ల రద్దు సమయంలో చెప్పిన మాటలను నిజం చేయాలని భావిస్తోంది. అదేంటి.. అంటే ఇక అంతా డిజిటల్ లావాదేవిలనే ప్రోత్సహించనుంది. అయితే డబ్బులెలా విత్ డ్రా చేయడం.? ఎమర్జెన్సీ అవసరంలో ఎలా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కాదూ. అయితే అందుకు అనుగూణంగా చర్యలను తీసుకున్న తరువాత డెబిట్ కార్డులు మాయం కానున్నాయి.

ఇందుకు ఎంతో సమయం లేదు. కేవలం రానున్న ఐదేళ్ల కాలంలో దానిని దేశవ్యాప్తంగా సాధ్యం చేసి చూపించనున్నామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ప్లాస్టిక్ కార్డులను తొలగించాలని యోచిస్తున్నామని, ఇది సాధ్యమేనని అన్నారు. దేశంలో ప్రస్తుతం 93 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయన్నారు. ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిన యోనో వంటి డిజిటల్ యాప్ సేవలను మరింత విస్తరించడం ద్వారా కార్డుల వినియోగాన్ని తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

యోనో యాప్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, దీని సాయంతో ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని, కార్డుతో పనిలేకుండానే దుకాణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం 68 వేలుగా ఉన్న యోనో కేంద్రాల సంఖ్యను మరో ఏడాదిన్నరలో పది లక్షలకు చేరుస్తామన్నారు. అప్పుడు కార్డుతో ఇక అవసరమే ఉండదని రజనీశ్ పేర్కొన్నారు. యోనో యాప్ ద్వారా కొన్ని వస్తువుల కొనుగోలుకు రుణం కూడా లభిస్తుందని, అప్పుడిక క్రెడిట్ కార్డుతో పనే ఉండదన్నారు. వచ్చే ఐదేళ్లలో కార్డు వినియోగం గణనీయంగా తగ్గుతుందని రజనీశ్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state bank of india  sbi atm  sbi debit card  sbi digital transactions  sbi yono app  

Other Articles