Advani not to hoist flag at his residence on I Day అద్వానీకి తీవ్ర అస్వస్థత.. పంద్రాగస్టు వేడుకులకు దూరం

Advani not to hoist flag at his residence on i day

LK Advani, ill health, BJP senior leader, Independence day, flag hoisting, I day celebrations, PM Modi

Senior BJP leader L K Advani is suffering from viral fever and therefore no flag-hoisting ceremony will be held tomorrow at his residence on the occasion of Independence Day, his office said

బీజేపి అగ్రనేత అద్వానీకి తీవ్ర అస్వస్థత.. పంద్రాగస్టు వేడుకులకు దూరం

Posted: 08/14/2019 06:53 PM IST
Advani not to hoist flag at his residence on i day

బీజేపి కురువృద్దుడు లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. తన అస్వస్థత కారణంగా ఆయన నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎగురవేసే జాతీయ పతాకాన్ని ఆయన ఈ సారి అవిష్కరించడం లేదని ఆయన కార్యాలయవర్గాలు తెలిపాయి. ప్రతీ ఏడాది ఆయన అనవాయితీగా దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జండాను అవిష్కరిస్తారు.

 అయితే, ప్రస్తుతం అద్వానీ అనారోగ్యం పాలవడంతో రేపు ఆయన నివాసంలో నిర్వహించాల్సిన పంద్రాగస్టు వేడుకలు నిర్వహించట్లేదు. ఈ విషయాన్ని అద్వానీ కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు ఆయన రేపు న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా హజరుకావడం లేదని పేర్కోన్నాయి. కాగా, న్యూఢిల్లీలోని 30, పృథ్వీరాజ్ రోడ్డు లో అద్వానీ నివాసం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles