Arun Jaitley's condition stable, says AIIMS మాజీ కేంద్రమంత్రి అరున్ జైట్లీకి తీవ్ర అస్వస్థత

Arun jaitley admitted to aiims kept under observation say reports

Arun Jaitley, Arun Jaitley health, Arun Jaitley news, Arun Jaitley health update, Arun Jaitley aiims, arun jaitley news, arun jaitley age, arun jaitley illness, arun jaitley health, arun jaitley latest, arun jaitley death, arun jaitley latest news, age of arun jaitley, arun jaitley death news, arun jaitley cancer, arun jaitley dead, about arun jaitley, arun jaitley health news

Arun Jaitley was admitted to the AlIMS in New Delhi. Former finance minister was admitted to AIIMS's cardiology department for a medical check-up. Arun Jaitley was admitted after he complained of breathing problems.

మాజీ కేంద్రమంత్రి అరున్ జైట్లీకి తీవ్ర అస్వస్థత

Posted: 08/09/2019 08:43 PM IST
Arun jaitley admitted to aiims kept under observation say reports

బీజేపి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు.  గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ బారిన పడినట్టు గతంలో ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చి అదే చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎయిమ్స్‌ వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు.

పరామార్శించిన పరధాని  మోదీ, అమిత్‌ షా  

అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, హర్షవర్దన్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, అశ్వని చౌబే, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధినేత శరద్‌ యాదవ్‌ తదితరులు ఎయిమ్స్‌ వద్దకు వచ్చారు. అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

కేంద్ర మంత్రులంతా ఒక్కక్కరిగా చేరుకుంటుండటంతో ఎయిమ్స్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించింది. ఈ రోజు ఉదయం ఆయన ఆస్పత్రిలో చేరారని.. ఐసీయూలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని పేర్కొంది. కాసేపట్లో మరో హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  health  aiims  PM Modi  Amit Shah  health bulletin  new delhi  

Other Articles