India reacts strongly to Pakistan’s decision పాకిస్థాన్ పున:సమీక్షించుకోవాలని కోరిన భారత్

India reacts strongly to pakistan s decision to downgrade bilateral ties

Vijay K. Nambiar,united nations,Shah Mehmood Qureshi,Pulwama,Jammu and kashmir,international law,India Pakistan trade,Government of Pakistan,Article 370, Imran Khan, Narendra Modi, Donald Trump, India, Pakistan, Trade, bilateral ties, foreign affairs, politics

The Ministry of External Affairs issued a strong statement earlier today in response to the decision by the Pakistan government to downgrade its bilateral ties with India.

పాకిస్థాన్ పున:సమీక్షించుకోవాలని కోరిన భారత్

Posted: 08/08/2019 08:37 PM IST
India reacts strongly to pakistan s decision to downgrade bilateral ties

జమ్ము-కశ్మీర్‌ లో అర్ఠికల్ 370తో పాటు ఆర్టికల్ 35ఎను కూడా భారత ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో పాకిస్థాన్ భారత్ తో దౌత్యపర సంబంధాలను ‘కనిష్ఠ స్థాయి’కి తగ్గించాలని, దీంతో పాటు ఇండియాత ఎలాంటి ద్వైపాక్షిక వాణిజ్యాన్న కూడా కొనసాగించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. అలానే భారత స్వతంత్ర దినోత్సవం నాడు జమ్మూకాశ్మీర్ కు సంఘీభావంగా బ్లాక్ డే ను కూడా పాటించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంత ప్రజల హక్కుల ఉల్లంఘనకు భారత్ పాల్పడుతుందని కూడా ప్రచారం నిర్వహించనుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ ను తన దూకుడు తగ్గించుకోవాలని ఇప్పటికే సూచించింది. అయితే పాకిస్థాన్ మాత్రం తాము చేస్తున్నదంతా సహేతుకమైనదనే మొండి వాదనను వినిపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ తన నిర్ణయాలను మరోమారు పున: సమీక్షించాలని భారత్ పాకిస్థాన్ ను కోరింది. ఇస్లామాబాద్ నుంచి రాయబారిని బహిష్కరించడం తగదని, ఈ తరహా నిర్ణయాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని అభిప్రాయపడింది.

 సంబంధాల రద్దు దిశగా పాక్ చెబుతున్న కారణాలు క్షేత్రస్థాయిలో సహేతుకంగా కనిపించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు భారత రాజ్యాంగాన్ని సవరించుకునేందుకు తమకు అన్ని హక్కులూ ఉన్నాయని పేర్కొంది. భారత వ్యవహారాల్లో తలదూర్చితే విజయం సాధించలేరని హితవు పలికింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Article 370  Imran Khan  Narendra Modi  India  Pakistan  Trade  bilateral ties  foreign affairs  politics  

Other Articles