Sushma Swaraj passes away at 67 తెలంగాణ చిన్నమ్మ ఇక లేరు..

Sushma swaraj passes away at 67 pm modi lk advani pay tribute

sushma swaraj, sushma swaraj age, sushma swaraj died, death of sushma Swaraj, Sushma Swaraj Holiday, Sushma Swaraj death holiday, sushma swaraj twitter,sushma swaraj tweet,sushma swaraj delhi cm,sushma swaraj husband,sushma swaraj latest news,sushma swaraj family,sushma swaraj holiday,swaraj Kaushal,sushma swaraj dead,age of sushma Swaraj,sushma swaraj daughter,sushma swaraj passed away

Former External Affairs Minister Sushma Swaraj passed away in Delhi last night; will be cremated with state honours today, PM Modi and BJP patriach LK Advani pay Tributes.

అస్లమించిన రాజకీయ మాతృత్వం.. సుష్మాస్వరాజ్ కన్నుమూత..

Posted: 08/07/2019 10:15 AM IST
Sushma swaraj passes away at 67 pm modi lk advani pay tribute

బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) ఇకలేరు. యావత్ భారతావనిని శోకసంద్రంలో ముంచుతూ గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. మంగళవారం (ఆగస్టు 6) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. గుండెపోటుకు గురైన కొద్ది క్షణాలకే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది.

సుష్మా స్వరాజ్ మరణవార్తతో బీజేపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. హోంమంత్రి అమిత్ షా, మంత్రలు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్.. ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన సుష్మా స్వరాజ్ 25 ఏళ్ల వయసులోనే హర్యాణా కేబినెట్‌లో మంత్రి పదవిని చేపట్టారు. పిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

సుష్మా స్వరాజ్‌ సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ పనిచేశారు. ఆమె భర్త కౌశల్‌ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో సుష్మాస్వరాజ్‌ 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో మంత్రిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

పాకిస్థాన్‌లోనూ సుష్మాకు అభిమానులు..

తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్‌ ప్రాంతాలకతీతంగా.. ఆ మాటకొస్తే దేశాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన చాలా మంది పౌరుల సమస్యలను పరిష్కరించి దాయాది దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నారు.2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా బాధ్యతలు నిర్వహించారు.

ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగానూ సుష్మా పనిచేశారు. షీలా దీక్షిత్‌‌కు గట్టి పోటీ ఇచ్చారు. 1998 అక్టోబర్‌ 13 నుంచి డిసెంబరు 3 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలలో జన్మించిన సుష్మా స్వరాజ్.. 1970లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏబీవీపీలో యాక్టివ్ మెంబర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సుష్మా స్వరాజ్.. అతి తక్కువ కాలంలోనే ఉన్నత పదవులను అధిరోహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIIMS  Sushma Swaraj  death  State honours  Last Rites  BJP  Narendra Modi  LK Advani  Amit Shah  

Other Articles