Hospitals may stop Aarogyasri services ప్రైవేటు ఆసుపత్రుల్లో.. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేకులు..

Empanelled hospitals threaten to stop treatment under aarogyasri

Arogya Sri, Private Hospitals, pending bills, 1500 crores, Hyderbad, warangal, arogya sri services, break to aroga sri, Telangana, latest news

Empanelled private hospitals have threatened to discontinue treatment of patients under Aarogyasri schemes from August 16 if the government fails to clear the dues.

ప్రైవేటు ఆసుపత్రుల్లో.. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేకులు..

Posted: 08/05/2019 02:47 PM IST
Empanelled hospitals threaten to stop treatment under aarogyasri

తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేకులు పడనున్నాయా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఆరోగ్యశ్రీ సేవల కింద రావాల్సిన బకాయిలను చెల్లించేవరకు తాము ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలను బంద్  చేయనున్నామని  ప్రైవేటు అసుపత్రిలు అల్టిమేట ఇచ్చాయి. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్లు బకాయి పడింది.

గత ఏడాదిన్నరగా ఈ సొమ్ము చెల్లించకపోవడంతో  ఆరోగ్యశ్రీ నెట్ వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు రావాల్సింది రూ.1500 కోట్లని అసోసియేషన్ చెబుతుండగా కాదు, రూ.800 కోట్లేనని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రవ్యాప్తంగా 330 ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికే ప్రభుత్వం ఏకంగా రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లిస్తామంటూ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అసోసియేషన్ పేర్కొంది. బకాయిల విడుదల విషయమై ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి ఈటలతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవోను కలవనున్నట్టు అసోసియేషన్ ముఖ్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles