Deadline for filing IT returns extended to 31 August పారాహుషార్ టాక్స్ పేయర్స్: గడవు దాటితే జేబుకు చిల్లే.!

Itr filing 2019 new deadline government extends due date by a month

Income tax, tax return, income tax return, tax return filing date, tax return deadline

The government extended the due date for filing income tax returns by individuals for financial year 2018-19 by a month till August 31.

పారాహుషార్ టాక్స్ పేయర్స్: గడవు దాటితే జేబుకు చిల్లే.!

Posted: 07/24/2019 11:40 AM IST
Itr filing 2019 new deadline government extends due date by a month

ఆదాయపు పన్ను దాఖలు చేసే వారికి ఐటీ శాఖ శుభవార్త చెప్పింది. పన్ను దాఖలుకు ఈ నెల 31తో ముగియనున్న గడువును సరిగ్గా నెల రోజులు అంటే ఆగస్టు 31 వరకు  పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐటీఆర్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుని పన్ను చెల్లింపుదారులకు కాసింత ఊరట కల్పించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు వెల్లడించింది.

వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31 తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ కమ్ టాక్స్ రిటార్న్స్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అయితే ఈ గడువును మరోసారి పొడిగించడం కుదరదని కూడా ఆదాయ మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. ఇక ఆగస్టు గడవు ముసిని తరువాత ఆధాయ పన్ను దాఖలు చేస్తే వారి జేబుకు చిల్లు పడుతుంది.

అదెలే అంటే.. ఆదాయపన్ను రిటార్న్ దాఖలు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ విధించిన గడువు ముగిసిన తరువాత కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయనివారు సమర్పించవచ్చునని కూడా ఆ శాఖవర్గాలు తెలిపాయి. అయితే, ఇందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి దాఖలు చేస్తే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా చేస్తే పదివేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అపరాద రుసుముల తరహాలో వీటిని విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income tax  tax return  income tax return  tax return filing date  tax return deadline  

Other Articles