Former Delhi CM Sheila Dixit passes away at 81 ఢిల్లీని ప్రగతి వైపు నడించిన నాయకురాలు ఇక లేరు

Ex delhi cm and congress leader sheila dikshit passes away at 81

Sheila Dikshit, Sheila Dikshit dead, Sheila Dikshit death, Sheila Dikshit dead reason, Sheila Dikshit news, congress, ex delhi chief minister, sheila dixit death, sheila dixit news, sheila dixit death news, who was sheila dixit, sheila dixit famil

Former chief minister Sheila Dikshit passed away on Saturday, hours after she was admitted to Fortis Escorts hospital in New Delhi. The 3-time Delhi CM, was brought to Fortis Escorts Heart Institute, Okhla in early hours of the day,

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కన్నుమూత

Posted: 07/20/2019 07:17 PM IST
Ex delhi cm and congress leader sheila dikshit passes away at 81

కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (81) ఇవాళ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా బ్రేవ్‌లేడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళ గవర్నర్ గానూ అమె కొంతకాలం పాటు సేవలందించారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వహించారు. పంజాబ్ లోని కపుర్తలాలో 1938 మార్చి 31 జన్మించిన షీలా, న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్, హిస్టరీలో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావోకు చెందిన ఐఏఎస్ అధికారి వినోద్ దీక్షిత్ ను వివాహం చేసుకున్నారు. తొలుత మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసి షీలా 70వ దశకంలో మహిళల కోసం వసతిగృహాలు ఏర్పాటు చేసుందుకు కృషిచేశారు. తరువాత ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా పనిచేశారు. 1984 ఎన్నికల్లో యూపీలో కనౌజ్ నుంచి తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ లోక్‌సభలో అంచనాల కమిటీలో పనిచేశారు.

మూడు వరుస ఎన్నికలలో విజయాన్ని సాధించి రికార్డ్ సృష్టించారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన షీలా.. అదే సంవత్సరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు సీఎంగా ఎన్నికయ్యారు. అయితే, డిసెంబరు 2013 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2014 మార్చిలో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. తొలిసారి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన షీలా, ఐక్యరాజ్యసమితి మహిళ కమిషన్లో భారత్ ప్రతినిధిగా 1984 నుంచి 89 వరకు ఉన్నారు.

విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా మూడేళ్లు, ప్రధాని మంత్రి కార్యాలయం సహాయ మంత్రిగాకూడా ఉన్నారు. మహిళలపై యూపీలో జరుగుతోన్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన షీలా, 1990 ఆగస్టులో 23 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో షీలాను కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆమె ఆసక్తి చూపలేదు. తిరిగి ఢిల్లీకి వచ్చిన ఆమె ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. షీలాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ 15వ లోక్‌సభకు తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sheila Dikshit  Sheila Dikshit dead  congress  ex delhi chief minister  sandeep dixit  

Other Articles