Kuwait and Saudi Arabia record highest temperature on earth వామ్మో భానుడు.. అక్కడ నెత్తినే నృత్యం చేస్తున్నాడు..

Kuwait city makes claim of 63 degrees celsius wmo yet to declare it as new world record

highest temperature, highest recorded temperature, Kuwait temperatures, heat wave in Kuwait, Kuwait heat, highest temperature in Kuwait, World Meteorological Organization, highest on record temperature, heat wave, severe heat wave in Saudi, Saudi heat, Saudi temperatures

According to reports, Kuwait City the capital of Kuwait recorded the highest day temperature in the world at 63°C under sunlight (and 52.2°C in the shadows). On June 13, this claim was reported by Gulf News, and in addition, it stated that Al Majmaah in Saudi Arabia recorded 55°C.

వామ్మో భానుడు.. అక్కడ నెత్తినే నృత్యం చేస్తున్నాడు..

Posted: 06/17/2019 05:28 PM IST
Kuwait city makes claim of 63 degrees celsius wmo yet to declare it as new world record

ప్రచండ భానుడి ఉగ్రరూపం శాంతించడం లేదు. వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు దాటుతున్నా.. నైరుతి రుతుపవనాల జాడ తెలియక రైతన్నలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా .. ప్రజలు మాత్రం వేసవి పోయినా.. ఆ తాపాన్ని మాత్రం ఇంకా గురవుతూనే ఉన్నారు. వేసవిలో మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు ఎలా మారాయనన్న విషయాలను మనం పంచుకున్నాం. నిజామాబాద్, అదిలాబాద్ సహా పలు జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిపిందే.

ఇక అటు  ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం నాటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5.8 డిగ్రీల వరకు అదనంగా నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, తుని, నెల్లూరు జిల్లా కావలి, గుంటూరు జిల్లా బాపట్లలో ఎండలు ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకాశం జిల్లా టంగుటూరులో గరిష్టంగా 45.53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమ, మంగళ వారాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడంతో వడగాల్పుల ప్రభావం కూడా కనిపిస్తోంది.

ఈ ఉష్ణ్రోగత్రతలకే మనం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఇక ప్రపంచ వ్యాప్తంగా భానుడి భగభగలు ఠారెత్తిస్తున్నాయి.  కువైట్‌ రాజధాని కువైట్‌ సిటీలో జూన్ 8వ తేదీన 63 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందట. నేరుగా ఎండలో ఈ ఉష్ణోగ్రత ఉండగా నీడలో 52.2 డిగ్రీలు ఉందని ‘గల్ఫ్‌ న్యూస్‌’ ప్రకటించింది. అదేరోజున సౌదీ అరేబియాలోని అల్‌ మజ్మా నగరంలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఈ వివరాలు ఇంతవరకు నిర్ధరణ కాలేదు. కాలిఫోర్నియాలోని ఫర్నేస్‌ క్రీక్‌ రాంచ్‌లో గల డెత్‌ వ్యాలీలో 1913 జులై 10వ తేదీన నమోదైన 56.7 డిగ్రీలే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డులలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles