students held for prostitution in mango farms మామిడితోటల్లో వ్యభిచారం.. పట్టుబడ్డ విద్యార్థులు

Students held for prostitution in mango farms in srikakulam

srikakulam students held in prostitution, students in prostitution, college students, mango farms narsannapeta, mango farms NH 16, srikakulam, andhra pradesh, crime

students from narsannapeta held red handedly for prostitution in mango farms at national highway 16 in srikakulam.

మామిడితోటల్లో వ్యభిచారం.. పట్టుబడ్డ విద్యార్థులు

Posted: 06/17/2019 02:45 PM IST
Students held for prostitution in mango farms in srikakulam

కాలేజీ కుర్రాళ్లు అంటే అల్లరి పనులు మాత్రమే చేస్తారు తప్ప.. తప్పులు చేయరు.. అవేశంలో తప్పులు చేసినా.. అసాంఘిక కార్యకలాపాలకు మాత్రం పాల్పడరని భావిస్తుంటారు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. కానీ తప్పులు చేయడం పక్కనబెడితే.. అసాంఘిక కార్యకాలపాలలో మునిగితేలుతూ.. పోలీసులు కూడా విస్తుపోయేలా చేశారు శ్రీకాకుళం జిల్లా కు చెందిన విద్యార్థులు. జిల్లా పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మామిడి తోటలనే వీరు అడ్డాలుగా మలుచుకుని తమ సరనసల్లాపాలను కొనసాగిస్తున్నారు.

మామిడి తోటల్లో జరగకూడని పనులు జరుగుతున్నాయని సమాచారం అందుకుని దాడులకు వెళ్లిన పోలీసులకు పలువురు కాలేజీ స్టూడెంట్స్ పట్టుబడ్డారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై మంది విద్యార్ధులు ముగ్గురు యువతులతో రసలీలల్లో కొనసాగుతున్న క్రమంలో పోలీసులు అకస్మిక దాడులు చేసి.. వారిని పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, నరసన్నపేట మండల పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన వ్యబిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పక్కాగా పథకం రచించి విద్యార్థులు మామిడి తోటల్లోకి వెళ్లిన సమయంలోనే సరిగ్గా అర్థరాత్రి పూట అకస్మాత్తుగా దాడులకు పాల్పడ్డారు. దీంతో అనేక మంది విద్యార్థులు పోలీసులకు చేతికి చిక్కారు. అక్కడ వీరికి 20 మంది యువకులు, ముగ్గురు అమ్మాయిలు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన వారిలో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ముగ్గురు అమ్మాయిలూ రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitution  students  college students narsannapeta  NH 16  srikakulam  andhra pradesh  crime  

Other Articles