కేంద్రంలో రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భేటీ అయిన నూతన క్యాబినెట్ తొలిభేటీలో అన్నదాతను కరుణించింది. గత పర్యాయం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా.. అన్నదాతలను అదుకునేందుకు ముందుకురాని ప్రభుత్వం ఈ సారి అధికారంలోకి వచ్చిరాగానే వరాలను కురిపించింది. నూతన క్యాబినెట్ తొలిభేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అదనపు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ఏటా 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతి రైతుకు కిసాన్ యోజన వర్తింప చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా చిన్న, సన్నకారు రైతుల పెన్షన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలావుంటే నూతన క్యాబినెట్ లో పదవులు దక్కిన వారిలో గుజరాత్ మార్క్ కూర్పు కనబడింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కేంద్ర హోంశాఖ పదవి లభించిన నేపథ్యంలో ఇలాంటి వార్తలు తెరపైకి వస్తున్నాయి.
దీంతో గతంలో అదే శాఖ నిర్వహించిన రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ కేటాయించగా, ఇప్పటి వరకు రక్షణ మంత్రిగా వ్యవహరించిన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను మోదీ అప్పగించారు. అయితే దేశ చరిత్రలో ఆర్థిక శాఖ చేపట్టబోతున్న నిర్మలా సీతారామన్ రికార్డు పుటల్లోకి ఎక్కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న రెండో మహిళాగా చరిత్ర సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1970లో ఏడాదిపాటు ఈ బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శాఖలు కేటాయించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more