BJP wins four seats in Telangana తెలంగాణలో నాలుగు స్థానాల్లో బీజేపి గెలుపు

New trend woes telangana bjp activists with win in four seats

Kishan reddy, Dharmapuri Arvind, Bandi Sanjay, soyam baburao, Adialabad parliament constituency, secundrabad parliament constituency, nizamabad parliament constituency, Karimnagar parliamentary constituency, BJP, TRS, Lok Sabha Elections, Telangana politics

BJP Secunderabad candidate Kishan Reddy has secured a good majority. With 62,960 Kishan Reddy defeated TRS candidate Talasani Sai Kiran Yadav.

తెలంగాణలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపి

Posted: 05/23/2019 05:11 PM IST
New trend woes telangana bjp activists with win in four seats

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేకెత్తించాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నాలుగు కాషాయ కుసుమాలు వికసించాయి. డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే గెలుచుకుని ఖంగుతిన్న బీజేపి.. తమ సత్తాను చూపించాలని కృతనిశ్చయంతో పనిచేస్తూ.. మునుపెన్నడూ తెలంగాణలో లేని విధంగా ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపి గెలుపోంది తన దృడ సంకల్పాన్ని చాటి చెప్పింది.

సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచిన సీనియర్ బీజేపి నేత కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ (తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు) పై విజయం సాధించారు. బండారు దత్తత్రేయ ఈ ధఫా ఎన్నికలలో పోటీకి దూరంగా వుంచిన బీజేపి అధిష్టానం ఆ స్థానాన్ని కిషన్ రెడ్డికి కేటాయించింది. మొదటి నుంచీ కూడా బీజేపీ రథసారథిగా కిషన్ రెడ్డికి ఈ సారి ఎమ్మెల్యేగా ఓటమిపాలైన తరువాత ఆయనపై వెల్లువిరిసన సానుభూతి కూడా గెలుపు కారణమయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ అభ్యర్థిపై కిషన్ రెడ్డి 51 వేల 801 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు.  

కరీంనగర్ తొలి విజయాన్ని ఖరారు చేసుకుంది. కరీంనగర్ లోక్ సభ స్థానం కోసం బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ .. టీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ తలపడ్డారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సుమారు 90902 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. కరీంనగర్ వంటి స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్లడం టీఆర్ఎస్ శ్రేణులను ఆలోచనలో పడేసింది. ఆ తరువాత ఆదిలాబాద్ లోక్ సభ స్థానం కూడా బీజేపి ఖాతాలోకి చేరిపోయింది.

అదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాబూరావు.. 56, 685 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి జి.నగేశ్ పై విజయం సాధించారు. ఇక నిజమాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపి అభ్యర్థిగా బరిలో దిగిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్.. తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై ఏకంగా 68000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయాలను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు తెలంగాణలో బీజేపీ బలపడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles