నగరంలో ఎండల ఎలా ఠారెత్తిస్తున్నాయో చెప్పడం కష్టమే. రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడి భగభగలకు ఎంతో మంది చనిపోగా, తాజాగా ఓ విదేశీ నటుడు కూడా సన్ స్ట్రోక్ బారిన పడి బలయ్యాడు. రష్యాకు చెందిన 38 ఏళ్ల నటుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. గచ్చిబౌలిలో అపస్మారక స్థితిలోకి జారుకున్న రష్యా నటుడ్ని గుర్తించిన సైబరాబాద్ పోలీసులు హుటాహుటిన అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అసుపత్రిలోనే ఆయన తన తుదిశ్వాసను విడిచాడు.
మృతుడికి చెందిన కెమెరాలో ఫొటోల ఆధారంగా ‘సైరా’ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ టూరిస్టు వీసాపై మార్చి నెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ గేట్ నెంబర్ -1 వద్ద ఇతను అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన ప్రకారం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 14వ తేదీ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ నెల 4, 5 తేదీల్లో ‘సైరా’ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించాడని పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌లో నివాసం ఉన్నాడు. మే 10వ తేదీన హోటల్ ఖాళీ చేశాడు. తర్వాత రోడ్లపైనే తిరిగాడని తెలుస్తోంది. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్‌కు సమాచారం అందించామని, అతను వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | ఒకనాటి ప్రేమ తాను ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకునేది.. కానీ ఇప్పటి ప్రేమ తన ప్రేమను అంగీకరించికపోయినా.. దూరం పెట్టినా ప్రతికారంతో రగలిపోయేదిగా మారింది. ప్రేమ గుడ్డిది అన్న మాటలను నిజం చేస్తూ ఎవరో... Read more
Mar 03 | ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి ఎమ్మెల్యేలు దళిత యువతులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా దళిత యువతులపై దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతుండగా, ఇటు కర్ణాటకలో... Read more
Mar 02 | పెట్రోల్, గ్యాస్ ధరలు సామాన్యుడికి గుదిబండలా మారాయి. కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడమన్నది లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టేసింది. ధరల పెరుగుదలపై జనాలు గుర్రుగా ఉన్నారు. దీంతో... Read more
Mar 02 | దేశన్ని డిజిటల్ ప్రపంచం ముంగిట్లోకి తీసుకెళ్లాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నేరగాళ్లు గండికొడుతున్నారు. ఎంతలా అంటే చమటోడ్చి ఆర్జించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకునే సామన్య మధ్యతరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకున్న నేరగాళ్లు వివిధ... Read more
Mar 02 | ఓట్ల కోసం నాయకులు ఎన్ని ఫీట్లయినా చేస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపి నేతలు కనిపించిన ఓటరు కల్లా టీ తాగించి.. చాయ్ వాలా ప్రధాని అనే అంశాన్ని బలంగా దేశ ప్రజల్లోకి... Read more