వాట్సాప్ యాప్.. ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ మెసేజింగ్ యాప్. వందలకోట్ల మంది వాడుతున్న నెట్ వర్క్. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎస్సెమ్మెస్ సర్వీస్‌ని మర్చిపోయేలా చేసిన యాప్. అలాంటి వాట్సాప్ యాప్ వైరస్ బారిన పడిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొని యూజర్లకు షాకిచ్చింది. వాట్సాప్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఓ స్పైవేర్ కొన్ని మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించిందని వాట్సాప్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ స్పైవెర్ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సైబర్ యాక్టర్ రూపొందించినట్లు తెలిపింది. వాట్సాప్ సెక్యూరిటీ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ స్పైవెర్ వచ్చిందని, ఈ లోపాన్ని ప్రస్తుతం సరిచేసినట్లు వాట్సాప్ కంపెనీ వెల్లడించింది. వాట్సాప్ వాయిస్ కాలింగ్‌లో వచ్చే మిస్డ్ కాల్స్‌తో ఈ స్పైవెర్ ఫోన్లలోకి ప్రవేశించినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మే మొదటివారంలోనే ఈ స్పైవెర్ను గుర్తించినట్లు తెలిపారు.
‘వాయిస్ కాలింగ్‌కు అదనపు భద్రతా ఫీచర్లను జోడిస్తున్న తరుణంలో మా బృందం ఈ లోపాన్ని గుర్తించింది. వాట్సాప్‌లోని ఈ లోపాన్ని అదనుగా చేసుకుని స్పైవెర్ యూజర్లపై దాడి చేసింది. యూజర్లకు గుర్తు తెలియని నంబరు నుంచి ఒకటి లేదా రెండు వాట్సాప్ వాయిస్ కాల్స్ వచ్చి ఉంటాయి. కాల్ చేసే సమయంలోనే స్పైవేర్ కోడ్ ఫోన్లోకి ప్రవేశించిందని’ వాట్సాప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more