proffessor kanche Illaiah controvesial comments తెలంగాణలో తెరవెనుక స్వాముల పాలన: కంచె ఐలయ్య

Proffessor kanche illaiah controvesial comments on cm kcr

professor kancha ilaiah controvesial comments on CM KCR, professor kancha ilaiah controvesial comments on Telangana Government, professor kancha ilaiah, kancha ilaiah, CM KCR, controvesial comments, Ramanuja Chinna Jeeyar Swamiji, Telangana, politics

professor kancha ilaiah controvesial comments on Telangana Government and CM KCR, alleges Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swamiji emerges as 'Super CM' in Telanganga

తెలంగాణలో తెరవెనుక స్వాముల పాలన: కంచె ఐలయ్య

Posted: 05/14/2019 03:36 PM IST
Proffessor kanche illaiah controvesial comments on cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ‘వై ఐ యామ్ నాట్ ఎ హిందు’ గ్రంథ రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెరవెనుక హిందూ ఆధ్యాత్మికవేత్తల పాలన సాగుతుందని అరోపించారు. ఈ క్రమంలో ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని చినజీయర్ పరిపాలిస్తున్నారని కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. ఓ స్వామీజి సీఎం కేసీఆర్ ను కేసీఆర్ ను శాసించి యాగాలు, హోమాలు చేయిస్తే.. మరో స్వామీజీ తెలంగాణను పాలిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు.

హైదరాబాదులోని పంజాగుట్టలో నేలకూల్చిన అంబేధ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వమే పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను శిక్షించాలి అనే అశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దళితులు, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రులను చేస్తానన్న ఆయన కనీసం రెండో పర్యాయమైనా తన హామీని నిలబెట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి హామి ఎమైందని ప్రశ్నించారు.

అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చినచోటే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేసిన ఆయన.. విగ్రహం కూల్చివేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్‌ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎక్కడా అంబేద్కర్‌ విగ్రహానికి అభివాదం చేసిందే లేదని అరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదని అన్నారు. అన్ని రకాల పీడనలకు, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని, అప్పుడే తెలంగాణలో కుల వివక్ష పోతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కావాలనే దళితులను, కమ్యూనిస్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles