Clarity emerges on Chiranjeevi International Schools ఆ స్కూల్ తో చిరంజీవి కుటుంబానికి సంబంధం లేదు..

Clarity emerges on chiranjeevi international schools

Chiranjeevi, Chiranjeevi International Schools, Srikakulam, IGCSE, CBSE, Ram Charan, Nagababu, Siva Cherry, Rashtra Chiranjeevi Yuvatha, srinivasa rao, andhra pradesh, politics

It has been rumoured that Megastar Chiranjeevi has invested in a school named Chiranjeevi International Schools in Srikakulam. Some media reports have even claimed that this is an indication that the 'Sye Raa' actor is permanently distancing himself from politics.

శ్రీకాకుళం చిరుంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ విషయంలో క్లారిటీ..

Posted: 05/13/2019 02:52 PM IST
Clarity emerges on chiranjeevi international schools

కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విద్యారంగంలో అడుగులు వేస్తున్నారని, ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతూ వచ్చాయి. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న ఈ కేంద్ర మాజీ మంత్రి ఇప్పుడు పాఠశాల విద్యపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇందుకు ఏపీలోని మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నారని వార్తలు వినిపించాయి. ఈ వార్తలనే పలు ఛానెళ్లు, పోర్టల్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశాయి.

దీంతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ సీఈవో జె.శ్రీనివాసరావు స్పందిస్తూ.. శ్రీకాకుళం జిల్లాలో త్వరలో పారంభంకానున్న తమ పాఠశాలకు, మెగాస్టార్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. సేవా దృకథంతో, సామాజిక స్పృహతో ఈ విద్యా సంస్థను శ్రీకాకుళంలో ప్రారంభించామని సంస్థ సీఈవో శ్రీనివాస్ రావు చెప్పారు.

మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే చిరంజీవిని గౌరవ ఫౌండర్ గా, రామ్ చరణ్ ను గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబును గౌరవ చైర్మన్ గా నియమించామని స్పష్టం చేశారు. ఈ పాఠశాలకు, మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. పేద ప్రజలకు అత్యున్నత సౌకర్యాలతో ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ సీఈవో జె.శ్రీనివాస్ రావు ఓ ప్రకటనను విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles