watch how lemon soda is made in hyderabad వైరల్ వీడియో: ఈ నిమ్మకాయ సోడాతో బోలెడంత అనారోగ్యం..!

Road side vendor uses dirty water to make lemon soda in hyderabad

road side vendor, lemon soda, hyderabad lemon soda, hyderabad, dirty water, unhygienic water, water borne diseases, hot summer drinks

road side vendor uses fills unhygienic water in his can to prepare and sell lemon soda to the customers in hyderabad, this act was caught by passers by and posted online which went viral.

వైరల్ వీడియో: ఈ నిమ్మకాయ సోడాతో బోలెడంత అనారోగ్యం..!

Posted: 05/02/2019 05:23 PM IST
Road side vendor uses dirty water to make lemon soda in hyderabad

మార్చి నెల వచ్చిందంటే చాలు ఎండలు దంచేస్తున్నాయని అంటుంటాం. ఇక వైద్యులు, వైద్య అధికారులు చెప్పినట్టుగా జేబులో చిల్లరతో వచ్చే చల్లటి పానీయాలను ఎక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే ఎండలో తిరిగేవారు అధికంగా చల్లని పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు కాబట్టి. ఇక అలా అని ముఫై రూపాయలు పెట్టి కొబ్బరిబోండాంలను, లేక యాభై అరవై రూపాయలు పెట్టి పండ్ల రసాలను తీసుకునే స్తోమత నూటిలో పది శాతం మందికి కూడా వుండదు.

కూల్ డ్రింకులపై ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున్న ప్రచారం జరగడంతో దాని జోలికి చాలా తక్కువ మందే వెళ్తున్నారు. అలా అని లస్సీలు, ఫలుదాలు కూడా తాగేందుకు వారు డబ్బును వెచ్చించలేరు. అయితే లెమన్ సోడా లేదంటే మజ్జిగను సేవించి సంతృప్తి చెందేవారి సంఖ్య ఎంతోవుందన్నది కాదనలేని సత్యం. చాలా మంది సామాన్యలు రోడ్లపై లభించే నిమ్మకాయ సోడాలనే ఆశ్రయిస్తారు. ఎందుకంటే ధర తక్కువ కావడం ఒక్కటైతే.. ఈ సోడాలు తోపుడు బండ్లపై ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తూ.. ఎండలో వెళ్లే
సామాన్యులను అకర్షిస్తాయి.

అంతేగా మరి రూ.10 వెచ్చిస్తే బాటిల్ నీరు కూడా రానీ ఈ రోజుల్లో రూ.10కే సోడాలో నిమ్మకాయను కూడా కలిపి ఇస్తున్నాడు. నిమ్మకాయకే రూపాయి పోతే.. నీరుకు మరో రూపాయి.. మసాలాకు మరో రూపాయి.. తోపుడు బండికి రెండు నుంచి మూడు రూపాయలు.. ఇలా అంతాపోతే కష్టపడి అమ్మిన వ్యక్తికి కనీసం సోడా మీద రూపాయి నుంచి రెండు మిగిలితే ఎక్కువ. అంటూ మంచి ఎండలో తన వాహనాన్ని అపి.. మిత్రుడితో కలసి పిచ్చాపాటిగీ ఈ వ్యాపారంలో ఏం మిగులుతుందిలే అనుకుంటూ గుటకేస్తూ నిమ్మసోడ తాగామా.? వెళ్లిపోయామా.? అనేది చేస్తుంటారందరు.

కానీ నిమ్మకాయలు బాగున్నాయా.? వాటిలో సోడాను తయారు చేసేందుకు వాడే నీరు తాగునీరేనా.? సోడా కోసం వినియోగిస్తున్న గ్యాస్ ఏంటీ.? ఇది అరోగ్యయుక్తమైనదేనా అన్న వివరాలను మాత్రం సేకరించరు. కష్టపడే వాడి బాధను పంచుకుని అయ్యోపాపం అంటూ ఒక సోడాకు బదులు మరో సోడా కూడా తాగేవారు.. తాము తాగుతున్న సోడా ఎలా తయారవుతుందన్న వివరాలను మాత్రం సేకరించరు. ఎందుకంటే అదే నమ్మకం. కానీ.. ఈ నమ్మకాన్నే సోమ్ముచేసుకుంటున్నారు చిరువ్యాపారులు. ఎలా అంటే.. ఈ వీడియోను చూస్తే మాత్రం మీ నమ్మకాలు ఎగిరిపోతాయి.

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఓ వ్యక్తి సోడా బండిని పెట్టుకున్నాడు. అయితే సోడాలో వినియోగించే నీటి కోసం అతను అనుసరించిన మార్గం చూసిన ప్రజలు మాత్రం విస్తుపోయారు. ట్యాంక్ బండ్ సమీపంలో ఫ్లైఓవర్ దగ్గర మొక్కలకు నీళ్లు పడుతున్న ఓ మహిళ దగ్గరకు ఈ డబ్బాను తీసుకెళ్లి పెట్టాడు. దీంతో ఆమె ట్యాప్ నీటిని అందులో నింపింది. దాన్ని తీసుకొచ్చిన అతను సోడాలు అమ్ముకునేందుకు బయలుదేరాడు. ఎవరు తీశారో తెలియదు కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles