Arrangements in placefor smooth polling: CEO ఈసీ ఎవరి అదుపాజ్ఞల్లో పనిచేయదు: సీఈఓ గోపాలకృష్ణ

Arrangements in place for hassle free polls ceo expects 80 85 per cent voter turnout

Gopal Krishna Dwivedi, Chandrababu Naidu, Chandrababu Naidu dharna, A.P. CEO, 2019 General Elections, General Elections 2019, Lok Sabha Elections, 2019 Lok Sabha Elections, AP Assembly Election 2019, Election Commission, CEO, Amaravati, Andhra pradesh, politics

Stating that foolproof arrangements were made to ensure smooth and peaceful conduct of elections in the State, Chief Electoral Officer Gopal Krishna Dwivedi has said that he expects voter turnout to be between 80 and 85 per cent.

ఈసీ ఎవరి అదుపాజ్ఞల్లో పనిచేయదు: సీఈఓ గోపాలకృష్ణ

Posted: 04/10/2019 08:35 PM IST
Arrangements in place for hassle free polls ceo expects 80 85 per cent voter turnout

ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని.. తమపై ఎవరి ఒత్తిడీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీనియర్‌ రాజకీయ నేతగా సీఎం చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. ఎన్నికల సంఘం ఏ ఒక్కరు చెప్పినట్లు నడుచుకోదని ఆయన చెప్పారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు కూడా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిపారు. రేపు (గురువారం) ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈవీఎంలు, వీవీప్యాట్ లను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అధికారులు సిబ్బందికి అందజేశామని తెలిపారు. వాటిని తీసుకున్న పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్ లకు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరి వెళ్లారని చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా ఉండే పోలింగ్‌ కేంద్రాల వద్ద మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ను నిర్ణీత సమాయానికి ఒక గంట ముందుగానే ముగిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియను వెబ్ కాస్టింగ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

రాష్ట్రంలో 46 వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,118 మంది..  25 లోక్‌సభ నియోజకవర్గాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. మొత్తం 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఈ సారి సుమారు 10 లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

అంతేకాకుండా 5 లక్షల 27 వేల మంది వరకూ దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరి కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. 56,908 మంది సర్వీసు ఓటర్లు, 5,323 మంది ప్రవాసాంధ్రులు కూడా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లోనే వీవీ ప్యాట్లను వినియోగిస్తున్న ఈసీ.. తొలిసారి బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles