Mamata Banerjee’s Helicopter Loses Its Way దారితప్పిన మమతా బెనర్జీ హెలికాప్టర్.. ప్రజల్లో అందోళన..

Mamata banerjee s helicopter loses its way near bangladesh border

Mamata Banerjee’s Helicopter Loses Its Way, Mamata Banerjee, helicopter, north dinajpur, Chopra, siluguri, Lok Sabha elections 2019, West Bengal

In a major security scare, a helicopter carrying West Bengal CM Mamata Banerjee to a public meeting at North Dinajpur lost its way. The incident set off alarm bells in the Chief Minister’s entourage as the venue, Chopra, is close to the international border shared with Bangladesh.

దారితప్పిన మమతా బెనర్జీ హెలికాప్టర్.. ప్రజల్లో అందోళన..

Posted: 04/10/2019 07:44 PM IST
Mamata banerjee s helicopter loses its way near bangladesh border

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తృటిలో ప్రమాదం తప్పింది. అమె చేరుకోవాల్సిన ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళుతూ.. మార్గమధ్యంలో దారితప్పినట్లు తెలుసుకుని వెనుదిరిగారు. ఉత్తర దినాజ్ పుర్ లోని బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తోన్న సమయంలో ఆమె హెలికాప్టర్‌ దారి తప్పింది. ఆ విషయం తెలియగానే కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆలస్యంగానైనా అమె అక్కడకు చేరుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

మమతా బెనర్జీ సభలో ఏర్పాటు చేసిన చోప్రా ప్రాంతంలోని వేదిక బంగ్లాదేశ్‌, భారత్ కు మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉంది. సిలిగురిలో నుంచి చోప్రా వద్దకు 20 నిమిషాల్లో రావాల్సిన మమత అర్ధగంట ఆలస్యంగా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఆ సభలో మాట్లాడుతూ..‘చేరుకోవాల్సిన ప్రాంతాన్ని పైలట్‌ గుర్తించకపోవడం నా ఆలస్యానికి కారణం. క్షమించండి. అతడు దారి తప్పాడు. సిలిగురి నుంచి 22 నిమిషాల్లో రావాల్సిన నేను 55నిమిషాల తరవాత చేరుకున్నాను’ అని ఆ సభలో వెల్లడించారు.

పలుమార్లు సంప్రదింపులు, రంగు రంగుల స్మోక్‌ గన్‌ సాయంతో చివరకు పైలట్ ప్రాంగణం వద్ద సురక్షితంగా చాపర్ ను దించారని సమాచారం. ఈ ఘటనపై మాట్లాడటానికి పోలీసు ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. గతంలో కూడా ఆమె భద్రతా వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. ఫిబ్రవరి 22న మమత ఉత్తర దినాజ్ పుర్ లో ప్రసంగిస్తోన్న సందర్భంలో రాబియా, అమైరా ఖాతున్‌ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు భద్రతావలయాన్ని దాటుకొని వేదిక వద్దకు చేరుకున్నారు. మమతా బెనర్జీకి జెడ్‌+ కేటగిరీ భద్రత ఉంది.

ఇక ప్రత్యర్థి నేతలు ప్రయాణించే చాపర్లే ఇలా ఎందుకు సమస్యలను ఎదుర్కోంటాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణించే వాహనం కుదుపులకు గురికావడం, తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రయానించే చాపర్ దారితప్పడం ఏంటన్న ప్రశ్నలు ఓ వైపు ప్రశ్నార్థకంగా మారుతూనే వున్నాయి. అయితే మమతా బెనర్జీ చాపర్ దారితప్పడంపై అత్యున్నత స్థాయి విచారణ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  helicopter  north dinajpur  Lok Sabha elections 2019  West Bengal  

Other Articles