Congress Leader Ramesh Rathod injured in Road Accident అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి గాయాలు

Adilabad congress mp candidate ramesh rathod injured in road accident

Adilabad, congress, Lok Sabha Election 2019, MP candidate, Lok Sabha Elections 2019, Telangana, Politics

Adilabad Congress MP Candidate Ramesh Rathod Injured In Road Accident at mavala of adilabad district.

ITEMVIDEOS: రోడ్డు ప్రమాదంలో అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి గాయాలు

Posted: 04/09/2019 11:59 PM IST
Adilabad congress mp candidate ramesh rathod injured in road accident

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా లోక్ సభకు బరిలో నిలిచిన ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ముగించుకుని అదిలాబాద్ కు తిరుగుపయనం అవుతన్న క్రమంలో మావల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ రాథోడ్‌కు గాయాలయ్యాయి.

ఈ ఘటనలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు రక్తపు గాయాలయ్యాయి. ఆయన చోక్కా, ఫ్యాంటుపై రక్తపు మరకలు వున్నాయి. ఆయన తలకు, చాతికి బలమైన గాయాలు అయినట్లు అనుచరులు చెబుతున్నారు. రామేష్ రాథోడ్ తో పాటుగా ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు అనునిత్యం తిరుగుతున్న కారు డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు.

కాగా, ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చిన పందిని తప్పించబోయి.. పక్కనున్న చెట్టుకు కారును ఢీకోట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆయన నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందా.? లేక అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా.? అన్న వివరాలనే దర్యాప్తులో తేల్చనున్నారు పోలీసులు. ఆయనకు రక్తపు గాయాలు కావడంతో వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles