IT Raids on TDP MP Galla Jayadev Office in Guntur టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ దాడులు

Breaking it raids on tdp mp galla jayadev office in guntur

Galla Jayadev accountant in IT custody, Galla Jayadev offices raided, Galla Jayadev IT raids, Galla Jayadev protest, Galla Jayadev Guntur collectorate, Galla Jayadev, TDP MP, IT raids, Guntur, political vendetta, Andhra pradesh, politics

Once again the IT raids in Andhra Pradesh have been creating hulchal in the political circle. The IT raids have been continuing targeting TDP leaders. In another shock to TDP cadre, today as the office of Guntur MP Galla Jayadev has been raided by IT sleuths.

ITEMVIDEOS: టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ దాడులు

Posted: 04/09/2019 10:58 PM IST
Breaking it raids on tdp mp galla jayadev office in guntur

ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న అరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు మాత్రమే ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోన్నారని ప్రశంసలు వినిపించాయి. అయితే గత రెండు రోజుల నుంచి టీడీపీ పార్టీ నేతలను కూడా ఐటీ అధికారులు టార్గెట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు, వారి సంబంధికులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

అయితే తాజాగా ఇవాళ గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. జయదేవ్‌ ఎన్నికల ఖర్చుల వివరాలను గుర్రప్పనాయుడు రెగ్యులర్‌గా రిటర్నింగ్ అధికారులకు అందిస్తున్నారు. అయినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్‌తోపాటు పలువురు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్‌గా చేసుకొని కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఎన్నికలకు 48 గంటల్లోపు గడువే ఉన్న తరుణంలో ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గుంటూరు లోక్ సభ స్థానం బరిలో టీడీపీ నుంచి సినీ హీరో మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ బరిలో ఉండగా.. వైసీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి జయదేవ్ పాత స్నేహితుడైన బోనబోయన శ్రీనివాస్ బరిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Galla Jayadev  TDP MP  IT raids  Guntur  political vendetta  Andhra pradesh  politics  

Other Articles