YSRCP contestant in Kuppam quits election campaign కుప్పంలో ప్రచారానికి దూరంగా వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి

Ysrcp contestant in kuppam quits election campaign

chandrababu, chandramouli, kuppam constituency, Subrahmanyam Reddy, chittor district, TDP, YSRCP, YS Jagan, andhra pradesh, politics

YSR Congress Party gets a blow in Kuppam Constituency, in Chittoor District with party leader Chandramouli who is contesting against chandrababu for the second time absconds election campaigning.

కుప్పంలో ప్రచారానికి దూరంగా వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి

Posted: 04/09/2019 08:44 PM IST
Ysrcp contestant in kuppam quits election campaign

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో కత్తులు నూరుకుంటుండగా, చిత్తూరు జిల్లా కుప్పం ప్రచారంలో వైసీపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆయన ఎక్కడున్నారో వైసీపీ నేతలకే అంతుబట్టడం లేదు. చంద్రమౌళి తరపున ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ప్రచారంలో కనిపిస్తున్నారు. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్నా ఆయన ప్రచారపర్వానికి ఎందుకు దూరంగా వున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న.

ఓటమి ముందే ఊహించగలిగే అభ్యర్థులైన తమ విజయం కోసం చివరి క్షణం వరకు పోరాడుతారు. కానీ తన గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించకుండా చంద్రమౌళి ఎందుకు దూరంగా వున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కుప్పంలో జగన్ నిర్వహించిన రోడ్డు షోలోనూ చంద్రమౌళి కనిపించలేదు. దీంతో ఆయన కుమారుడు భరత్‌ను పక్కన నిల్చోబెట్టుకుని జగన్ ప్రచారాన్ని ముగించారు. ప్రచారంలో చంద్రమౌళి ఎక్కడా కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, కుప్పం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చంద్రమౌళి భార్య పద్మజ.. భర్త కోసం ప్రచారం చేస్తుండడం విశేషం. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న ఆమె తనకు కాకుండా తన భర్తకు ఓటు వేయాలని కోరుతున్నారు. అనారోగ్య కారణాల వల్లే చంద్రమౌళి బయటకు రాలేదన్న వార్తలు వినిపిస్తుండగా, చంద్రబాబు వంటి కొండను ఢీకొని గెలవడం సాధ్యం కాదని ముందే ఓటమిని ఒప్పేసుకుని ప్రచారానికి రావడం లేదన్న మరో వాదన వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  chandramouli  kuppam constituency  chittor district  andhra pradesh  politics  

Other Articles