Narrow escape for TRS MLA Harish Rao హరీశ్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం..

Narrow escape for trs senior mla harish rao

Narrow escape for TRS MLA Harish Rao, TRS MLA Harish Rao, Toopran road show, fire in prachara ratham, Toopran, Fire accident, kotha prabhakar reddy, Telangana, politics

Telangana former minister, Ruling party TRS senior MLA Harish Rao had a narrow escape in toopran election road show, as his vehicle (prachara ratham) caught fire.

హరీశ్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం..

Posted: 03/29/2019 10:34 PM IST
Narrow escape for trs senior mla harish rao

ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హరీశ్‌రావు ప్రచార రథంలో మంటలు వ్యాపించడంతో అయన వాహనం దూకి పక్కకు జరగడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. తూప్రాన్ లో ఆయన పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచారం నిర్వహిస్తున్న ప్రచార రథంలోనే అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

మంటలు చెలరేగిన సమయంలో ఆయన ప్రచార రథంపైనే ప్రసంగిస్తున్నారు. కార్యకర్తలు పెద్దఎత్తున్న మంటలు అని అరవడంతో ప్రచార రథంపై వున్న నేతలు అందరూ వాహనాన్ని దిగి దూరంగా పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ప్రసంగాన్ని నిలిపేసిన హరీశ్ రావు రథం దిగేసి దూరంగా పరిగెత్తిన తరువాత కార్యకర్తలు మంటలను అపేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

హరీష్ రావుతోపాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు కూడా వాహనం దిగి దూరంగా వెళ్లారు. ఎలాంటి అపాయం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక కార్యకర్తలు ఇసుక, మట్టి, నీళ్లు చల్లుతూ మంటలను అపే ప్రయత్నం చేశారు. కాగా గతంలోనూ ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చిన సందర్భంగా హరీశ్‌ రావుకు ప్రమాదం తప్పిన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles