YS Viveka murder case: family seek CBI probe వైఎస్ వివేకా హత్యకేసు: హైకోర్టులో సౌబాగ్యమ్మ పిటీషన్

Ys vivekananda reddy family seek cbi probe in the murder case

YS Vivekananda Reddy murder case, YS Viveka's wife Soubhagyamma approches High court, YS Vivekananda Reddy, CBI probe, SIT, Pulivendula, YS Soubhagyamma, YS Viveka's wife, YS Vivekananda Reddy murder case, AP High Court, Andhra pradesh, politics

In the murder case of YSRCP leader and former minister YS Vivekananda Reddy, YS Viveka's wife Soubhagyamma, has approached the high court that they don't have confidence on AP police investigation, and she filed a petition that the case should be investigated by the CBI.

వైఎస్ వివేకా హత్యకేసు: హైకోర్టులో సౌబాగ్యమ్మ పిటీషన్

Posted: 03/25/2019 06:13 PM IST
Ys vivekananda reddy family seek cbi probe in the murder case

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురై పది రోజులు కావస్తున్నా.. ఆయన హత్యకేసులో నిందితులను గుర్తించడంలో ఇంకా పోలీసులు ఎలాంటి క్లూ లభించడం లేదు. ఈ కేసు విచారణ సిట్ అధికారుల బృందం విచారణ కూడా నిరాధారంగానే ముందుకు సాగుతోంది. ఇప్పటికీ వైఎస్ వివేకా మరణంపై అధికార, విపక్షాల మధ్య విమర్శల దాడి సాగుతుంది. దీంతో ఆయన భార్య సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టులో ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ దాఖలు చేసిన మూడు రోజులు అవుతున్నా.. ఇంకా నెంబరింగ్ కకపోవడంతో మరో పిటీషన్ వేశారు. ఏపీ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సౌభాగ్యమ్మ కూడా హైకోర్టును ఆశ్రయించి తమ పిటిషన్ లో పేర్కోన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లేదా మూడో పార్టీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సౌభాగ్యమ వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరపనుంది.

ఈ కేసు విషయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కలిసిన వివేకానంద రెడ్డి కూతురు సునిత కలిసిన విషయం సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసు దర్యాప్తుపై ప్రభావం చూపేలా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలు వున్నాయని అమె అధికారులకు పిర్యాదు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలియడం లేదని, సిట్ అధికారులపై నమ్మకం లేదని సీబీఐ చేత విచారణ చేయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా అమె ఇప్పటికే అధికారులను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles