BJP shocks Shatrughan Sinha in Patna Sahib ప్రధానిపై విమర్శలు చేసిన బీజేపి నేతకు షాక్..

Bjp drops shatrughan sinha fields ravi shankar prasad from patna sahib

bihar bjp candidates, bihar bjp candidate list 2019, bihar bjp lok sabha candidates, bihar bjp candidate 2019, candidate list of bihar bjp, bihar bjp list 2019, Politics

Rebel Bharatiya Janata Party leader Shatrughan Sinha has been dropped from the list. The BJP has instead fielded Union Minister Ravi Shankar Prasad from Shatrughan Sinha's Patna Sahib seat.

ప్రధానిపై విమర్శలు చేసిన బీజేపి నేతకు షాక్..

Posted: 03/23/2019 02:12 PM IST
Bjp drops shatrughan sinha fields ravi shankar prasad from patna sahib

ఫైర్ బ్రాండ్, బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హాకు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ప్రధాని నియంత విధానాలను వ్యతిరేకిస్తున్న ఆయన బీహర్ బీజేపిలో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పరిశీలించని సమయం నుంచి ఆ వ్యతిరేకత మరింత పెరిగింది. నోట్ల రద్దు నుంచి రాఫెల్ వరకు అన్ని విషయాల్లో ప్రధాని విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చిన నేత పట్ల బీజేపి సరిగ్గా ఎన్నికల సమయం చూసుకుని ప్రతీకారం తీర్చుకుంది.

లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ను నిరాకరించింది. ఆయన ప్రతినిథ్యం వహిస్తున్న బీహార్ లోని పాట్నాసాహిబ్ స్థానాన్ని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు కేటాయించింది. ఎన్డీయే పొత్తులో భాగంగా బీహార్ లో తాము పోటీ చేయనున్న మొత్తం 40 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గత కొంత కాలంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ, తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిన్హాకు అధిష్ఠానం మొండిచేయి చూపించింది.

పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి సిన్హా రెండు సార్లు వరుసగా గెలుపొందారు. గత రెండేళ్లుగా విపక్షాలతో కలసి బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు సమస్యలు, నిరుద్యోగం, రాఫెల్ డీల్ తదితర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా, ఢిల్లీలలో విపక్షాలు నిర్వహించిన మెగా ర్యాలీల్లో సైతం సిన్హా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయనపై బీజేపీ అధిష్ఠానం కొరడా ఝుళిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatrughan Sinha  Patna Sahib  Ravi Shankar Prasad  BIhar  national Politics  

Other Articles