Jagan demands CBI Investigation in YS Viveka Murder వైఎస్ వివేకా హత్యేపై.. సీబిఐ విచారణకు జగన్ డిమాండ్

Ys jagan demands cbi investigation in ys vivekananda reddy murder

YS Jagan, YS Jagan Mohan Reddy, CBI Investigation, CM Chandrababu, YS RajaReddy, YS Vivekananda Reddy murder, YS Vivekananda Reddy brutal murder, YS Vivekananda Reddy killed, Seven stabings on ys vivekananda reddy body, YS Jaganmohan Reddy, Y. S. Rajasekhara Reddy, Kadapa district, jaganmohan reddy, Amaravati, Andhra Pradesh, Politics

YSRCP President YS Jagan Mohan Reddy demands CBI Investigation into the murder of his uncle YS Vivekananda Reddy brutal murder, He suspects Andhra Pradesh chief minister Chandrababu Naidu role behind the murder.

వైఎస్ వివేకా హత్యేపై.. సీబిఐ విచారణకు జగన్ డిమాండ్

Posted: 03/15/2019 06:17 PM IST
Ys jagan demands cbi investigation in ys vivekananda reddy murder

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర వున్న నేతను అత్యంత దారుణంగా ఇంట్లోకి ప్రవేశించి నరికి చంపారని అయన అరోపించారు. ఈ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని వైఎస్ జగన్ అన్నారు. విచారణ అధికారులకు తన కళ్ల ముందే ఫోన్లు వచ్చాయని, కేసు దర్యాప్తులో అనేక రకాలుగా ప్రభావం చూపుతున్నారని జగన్ అరోపించారు.

బెడ్ రూమ్ లో దారుణంగా నరికి చంపిన హంతకులు ఆయనను బాత్ రూమ్ వరకు తీసుకెళ్లి అక్కడ పడవేశారని, బాత్ రూమ్ గోడలకు రక్తం పూసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అరోపించారు. వైఎస్ వివేకా హత్య రాజకీయంగా నీచమైన చర్యగా పేర్కోన్న ఆయన.. ట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి దారుణంగా నరికి చంపారని అరోపించారు. ఇక ఓ తప్పుడు లేఖని సృష్టించి..డ్రైవర్‌పై నేరం మోపేందుకు కుట్రచేశారని ఆరోపణలు చేశారు.

తమ తాత రాజారెడ్డి, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గతంలో ఇలానే కుట్రచేసి చంపేశారని.. తనపైనా విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిందన్నారు. ఇప్పటికీ తమ తండ్రి మరణంలో ఇంకా అనేక అనుమానాలు కోనసాగుతూనే వున్నాయన్నారు. ఈ మూడింటిలోనూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే తమ తాత, బాబాయ్ లపై హత్యలు జరిగాయన్న ఆయన.. ఇప్పుడు తాజాగా తనపై కూడా హత్యయత్నం జరిగిందని అరోపించారు. సీబిఐ దర్యాప్తు వేస్తేనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YS Vivekananda Reddy  CBI Investigation  CM Chandrababu  kadapa  Andhra pradesh  Politics  

Other Articles