Joinings and protest at YCP President Jagans' house ఇటు చేరికలు.. అటు అందోళనలు.. లోటస్ పాండ్ వద్ద ఇదీ పరిస్థితి..

Joinings and protest at ycp president jagans house at lotus pond

YCP leaders Protest lotus pond, uravakonda activist protest at lotus pond, bapatla ycp activist protest at lotus pond, kona raghupathi, govardhan reddy, YCP MLA Sunil, puthalapattu MLA Sunil, YCP MLA denied entry into Jagan House, YSRCP party President YS Jagan, 'YS Jagan's house Lotus pond, Andhra Pradesh, politics

After YCP MLA Sunil from puthalapattu assembly was in the news a day before, for denied entry into YSRCP party President YS Jagan's house, Now with joinings and protest again Lotus pond is in the news.

ఇటు చేరికలు.. అటు అందోళనలు.. లోటస్ పాండ్ వద్ద ఇదీ పరిస్థితి..

Posted: 03/13/2019 01:06 PM IST
Joinings and protest at ycp president jagans house at lotus pond

హైదరాబాద్ నుంచే చక్రం తిప్పాలని, అక్కడి ఆస్తులతో పాటు ఇక్కడి అధికారం కావాలని అధికార పార్టీ నేతల విమర్శలను ఎదుర్కోంటున్నా.. ఏ మాత్రం మొక్కవోని వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో గత నివాసం నుంచే అభ్యర్థులను ఖారారు చేసే బాధ్యతను చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసం ముందర సందడి వాతావరణం అములుకుంది. ఓ వైపు చేరికలతో మరోవైపు అశావహుల నిరసనలు, ధర్నాలతో సందడి సందడిగా వుంది.

ఇప్పటికే పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కు లోటస్ పాండ్ వద్ద చేదు అనుభవం ఎదురైందన్న వార్త పలు పత్రికలలో ప్రచురితం కావడం.. పార్టీ అధినేతను కలిసేందుకు ఆయన గత మూడు రోజులుగా లోటస్ పాండ్ వద్ద పడిగాపులు కాయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలావుండగా, తాజాగా ఇవాళ ఉదయం నుంచి పార్టీలో సినీనటుడు రాజారవీంద్ర సహా కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబసభ్యులు, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ ల చేరికలతో లోటస్ పాండ్ వద్ద సందడి వాతావరణం అలుముకుంది.

మరోవైపు టికెట్ ఆశించే నేతలు తమ అనుచరులతో ఆందోళనకు దిగుడంతో కొంత టెన్షన్ కూడా అలుముకుంది. నిన్న ఉరవకొండ నియోజకవర్గానిక చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగాగగా... ఇవాళ బాపట్ల నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. బాపట్ల నియోజకవర్గ టికెట్ ను గోవర్ధన్‌రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు హంగామా చేశారు. ఓరుగంటి రెడ్లకు సీటు ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి సీటు ఇవ్వొదని డిమాండ్ చేశారు. రావాలి జగన్.. పోవాలి కోన అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కాగా, నిన్న బాపట్లలో కూడా పెద్ద ఎత్తున కోనకు వ్యతిరేకంగా... జగన్‌ను అనుకూలంగా.. గోవర్ధన్‌రెడ్డి అనుచరులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lotus pond  uravakonda  bapatla  goverdhan reddy  kona raghupathy  Sunil  Andhra pradesh  Hyderabad  politics  

Other Articles