Ganta briefs chandrababu on talks with JD Laxminarayana చంద్రబాబుతో గంటా సమావేశం.. జేడీతో భేటీ విషయాల వివరణ..

Ganta srinivasa rao meets chandrababu discuss on talks held with jd laxminarayana

JD Laxminarayana, Ganta Srinivasa Rao, General Elections 2019, TDP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Bheemili assembly constituency, vishakapatnam, Andhra Pradesh, Politics

Andhra Pradesh Minister and TDP Leader Ganta Srinivasa Rao meets Party President and CM Chandrababu and briefs on talks held with CBI former Joint Director VV Laxminarayana,

చంద్రబాబుతో గంటా సమావేశం.. జేడీతో భేటీ విషయాల వివరణ..

Posted: 03/13/2019 11:46 AM IST
Ganta srinivasa rao meets chandrababu discuss on talks held with jd laxminarayana

ఓబుళాపురం అక్రమ మైనింగ్, వైఎస్ జగన్ అక్రమాస్థుల కేసుల విచారణతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ.. టీడీపీ పార్టీలో చేరతారనే ప్రచారంతోనే వైసీపీ విమర్శలను గుప్పించడం ప్రారంభించింది. ఏకంగా వైసీపి అధికార ప్రతనిధి అంబటి రాంబాబు తెరపై కి వచ్చి.. చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరూ తోడు దొంగలని కూడా విమర్శలు గుప్పించారు. ఈ తొడుదొంగలు ఏకమై జగన్ పై అక్రమ కేసులు బనాయించారని అరోపించారు.

జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ పార్టీలో చేరతారని సంకేతాలు రావడం, మంత్రి గంట శ్రీనివాసరావుతో ఆయన భేటీ కావడం.. భీమిలి నియోజకవర్గాన్ని ఆయనకు ఆపర్ చేయడంపై వైసీపీ విమర్శనాస్త్రాలు గుప్పించింది. అయితే ఈ విషయాలపై తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. తాను వివి లక్ష్మీనారాయణతో భేటీ అయ్యిన విషయాలను ఆయన చంద్రబాబుకు స్వయంగా వివరిస్తున్నారు.

క్రితం రోజున జేడీ లక్ష్మీనారాయణతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మంత్రి నారా లోకేష్‌... భీమిలి నుంచి పోటీచేస్తారనే చర్చ సాగినా... ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేసే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ తాజా అరోపణలు, విమర్శల నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ను నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  JD Laxminarayana  Ganta Srinivasa Rao  Bheemili Assembly  Andhra Pradehs  Politics  

Other Articles