pubg game takes youth life in Telangana కేసీఆర్ ఇలాకాలో.. యువకుడి ఉసురుతీసిన మొబైల్ గేమ్

Telangana youth commits suicide after parents scolding for playing pubg game

youth suicide, pubg game, gajwel, Pragnapur, siddipet, pubg mobile game, Telangana, Crime

Telangana youth Sai charan, from CM KCR constituency Gajwel pragnapur commits suicide after parents scolding for playing pubg game instead of keeping interest on studies.

కేసీఆర్ ఇలాకాలో.. యువకుడి ఉసురుతీసిన మొబైల్ గేమ్

Posted: 03/12/2019 02:44 PM IST
Telangana youth commits suicide after parents scolding for playing pubg game

పబ్జీ గేమ్.. పిల్లలను, యువతను తనవైపుకు ఆకర్షిస్తున్న గేమ్ ఇది. ఈ గేమ్ పై ఇప్పటికే పలు భారతీయ పట్టణాలు, నగరాల్లో పోలీసులు నిషేధం విధించారు. ఇకపై ఎవరైనా పబ్జీ గేమ్ అడినట్లు కనిపిస్తే వారిపై పిర్యాదు చేస్తే వారికి శిక్ష కూడా విధించేలా చట్టాలను తీసుకువచ్చారు పోలీసు అధికారులు. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా ఇలాంటి మార్పులు రావడం లేదు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పేకాట క్లబులు కనిపించడం లేదు. పేకాల వల్ల ఇల్లు గుల్ల చేసుకునే వారు కానీ, ప్రాణాలు తీసుకుని వారు కానీ కనిపించడం లేదు. అయితే పెద్దవారి విషయంలోనే నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఎంతో ఉజ్వల భవిష్యత్తు వున్న బాలబాలికలు, యువత విషయంలో మాత్రం జాప్యం చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ కోట్ సహా గిర్, సోమనాథ్, భవ్ నగర్ తో పాటుగా పలు నగరాల్లో నిషేధం వున్న పబ్జీపై తెలంగాణలో కూడా విధించవచ్చుకదా.. అన్న అభ్యర్థనలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ గేమ్‌కు బానిసలవ్వద్దని అటు వైద్యులు, ఇటు నిపుణులు చెబుతున్నా యువత, బాలబాలీకలు పెడచెవిన పెడుతున్నారు. ఈ గేమ్ మత్తులో చిక్కుకుని అనేక మంది యువత తమ చదువులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నా.. ప్రభుత్వం ఈ పబ్జీ గే్మ్ పై చర్యలు చేపట్టకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పబ్జీ గేమ్ విషయంలో ఉపేక్షించడం సరికాదని వెంటనే నిషేధం విధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫలితంగా పబ్జీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇదే గేమ్‌కు బానిసలా మారిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జరిగింది.

మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్ కు చెందిన శేషత్వం వెంకటనారాయణ- శారద దంపతుల చిన్న కుమారుడు సాయిచరణ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతడు కొన్ని రోజులుగా పబ్జీ గేమ్ కు అలవాటు పడి చదువును నిర్ణక్ష్యం చేస్తున్నాడు. గమనించిన తల్లిదండ్రలు అతడిని మందలించారు. అయినా, అతడు వారి మాటను వినలేదు. దీంతో గేమ్ ఆడవద్దంటూ గట్టిగా చెప్పారు.

దీంతో మనస్థాపానికి గురైన సాయిచరణ్.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కొడుకు గదిలో ఏం చేస్తున్నాడోనన్న అనుమానంతో వచ్చి చూసే సరికి సాయిచరణ్ ఫ్యాన్ కు వెలాడుతూ కనిపించాడు. పక్కింటి వారి సాయంతో తలుపులు పగలకొట్టి అతడిని బయటికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే సాయిచరణ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : youth suicide  pubg game  gajwel  Pragnapur  siddipet  pubg mobile game  Telangana  Crime  

Other Articles