vv laxminarayana to contest in 2019 elections ఎన్నికల బరిలో నేనూవున్నానోచ్..!: జేడీ లక్ష్మీనారాయణ

Ex cbi officer vv laxminarayana to contest in elections

VV Laxmi Narayana, Former CBI Joint Director in elections foray, VV Laxmi Narayana in Elections foray, CBI JD, Elections, Srikakulam, Jaya Prakash Narayan, lok satta party, pawan Kalyan, Janasena, Andhra Pradesh, Politics

The Former CBI Joint Director VV Laxmi Narayana says he too is in elections foray, Speaking to media in srikakulam he says he is willing to contest elections but not yet decided to be in race for lok sabha or assembly.

ఎన్నికల బరిలో నేనూవున్నానోచ్..!: జేడీ లక్ష్మీనారాయణ

Posted: 03/05/2019 03:09 PM IST
Ex cbi officer vv laxminarayana to contest in elections

రానున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ వంతుగా ప్రచారపర్వంలో బిజీగా వున్న క్రమంలో తాను ఎన్నికల బరిలో నిలుస్తానని, రైతుల సమస్యలే తన ఏజెండా పార్టీని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి రాష్ట్ర పర్యటన కూడా పూర్తి చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ మాత్రం ఇంకా తన జోరు పెంచలేకపోతున్నారు. ఇక తానే పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆయన పార్టీని కూడా స్థాపించలేకపోయారు. ఇక తన పార్టీకి కూడా అధికార గుర్తింపు వచ్చేందుకు ఎన్నికల సంఘం నుంచి  కూడా గుర్తింపు రావాల్సిన అవసరం వుంది.

దీంతో తన పార్టీ తరపున పోటీ చేసే అవకాశం లేని జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది అసక్తికరంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన లోక్ సత్తా పార్టీ నుంచి పోటీ చేస్తారా.? లేక తాజాగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న సినీనటుడు పవన్ కల్యణ్ పార్టీ తరపున బరిలోకి దిగుతారా.? లేక అధికార టీడీపీ పార్టీ నుంచే ఆయన పోటీకి దిగుతారా.? అన్న అంశం ఆసక్తికరంగా మారింద. అయితే తాజగా ఆయన రానున్న ఎన్నికల్లో తాను బరిలో నిలుస్తున్నట్లు తాజాగా మరోమారు ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఎన్నికల బరిలో నిలువనున్నట్లు చెప్పారు. అయితే అసెంబ్లీ స్థానం నుంచి బరిలో వుండాలా.. లేక పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలన్న అన్న అంశంలో ఇంకా క్లారిటీ మాత్రం రాలేదని వివరించారు. రాష్ట్రంలో ఎన్నికలు అనగానే డబ్బే ప్రధానపాత్ర పోషిస్తోందన్న ఆయన... ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేసే విధానం కాకుండా... అసలు డబ్బే తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసేలా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆ దిశగానే తన చర్యలు, పోరాటం ఉంటాయన్నట్లుగా లక్ష్మీనారాయణ సంకేతాలిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VV Laxmi Narayana  CBI JD  Elections  Srikakulam  Andhra Pradesh  Politics  

Other Articles