Martyr's widow being forced to wed bro-in-law కాసుల కోసం కక్కుర్తి.. భర్త తమ్ముడితో కల్యాణమా.?

Arked to marry bro in law jawan s wife seeks cops help

Kalavathi, Widow of Pulwama attack deceased jawan, H Guru CRPF jawan, brother-in-law, Government compensation, Sumalatha, Pulwama, doddarasinakere, Central Reserve Police Force, Ambareesh, mandya

Kalavathi lost her CRPF jawan husband H Guru in the Pulwama terror attack is under pressure from Guru’s family to marry her brother-in-law, with an eye on the government and Army compensation due to the young widow.

పూల్వామా అమరుడి భార్యకు అత్తారింట్లో వేధింపులు..

Posted: 02/28/2019 02:21 PM IST
Arked to marry bro in law jawan s wife seeks cops help

పూల్వామా దాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ భార్యకు అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. కాసుల కోసం కక్కుర్తి పడిన అత్తారింటి కుటుంబసభ్యులు అమెను అమరుడి తమ్ముడికి (మరిదికి) ఇచ్చి కల్యాణం చేయాలని సిద్దమయ్యారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇవ్వబోయే భారీ నష్టపరిహారం సొంతం చేసుకోవడమే వారు ఈ ఘోరానికి పాల్పడేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు ఈ పెళ్లికి ఒప్పుకోవాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. భర్త పోయి తీవ్ర దిగ్బ్రాంతిలో వున్న అమెను అతని అంతిమసంస్కారాలు ముగిసి ముగియగానే అమెపై అత్తారింటివారు ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టారు.

చెట్టంత కోడుకు పోయాడన్న బాధ ఏ కోశాన లేని తల్లిదండ్రులు.. అటు ప్రభుత్వం, ఇటు భారత సైన్యం, దీనికి తోడు దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి, నిన్నటితరం హీరోయిన్ సుమలత కూడా అర ఎకరం భూమి ఇస్తానన్న హామీల నేపథ్యంలో.. తమ దారిద్ర్యం తీరుతుందని.. దానిని దక్కించుకోవాలన్న యావ తప్ప.. కొడుకు మరణంపై కించింత్ అవేదన కూడా వారికి లేదు. చివరికి దశదిన కర్మ నాటి రోజు నుంచి ఈ వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మాండ్యాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ హెచ్.గురు ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడయ్యారు. ఈ ఘటన అనంతరం పలువురు వ్యక్తులు సీఆర్పీఎఫ్ జవాన్లకు సాయం ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందనుంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం నగదు దక్కించుకునేందుకు వీలుగా గురు కుటుంబ సభ్యులు పావులు కదిపారు. మరిదిని పెళ్లి చేసుకోవాలని గురు భార్య కళావతి(25)పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి వేధింపులు హద్దుదాటడంతో ఆమె మాండ్యా పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కళావతికి ఉద్యోగం కల్పించాలని సంబంధిత అధికారులను కర్ణాటక సీఎం కుమారస్వామి ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalavathi  H Guru  widow of CRPF Jawan  mandya  Sumalatha  Govt Compensation  politics  

Other Articles