BJP leader arrested for staging abduction in Bengal ప్రబీజేపి నేత దాష్టికం.. కన్న కూతురినే..

Bjp leader arrested for alleged role in his daughter s kidnap

Bengal, BJP, Prathama Batabyal, Suprabhat Batabyal, Kidnap, Gun point, Daughter, Kidnap, Abduct, Fake, TMC, West Bengal, Politics

Bengal Police have arrested a BJP leader of Birbhum district three days after he alleged his daughter was abducted, following which his supporters chased down a local Trinamool Congress MLA Manirul Islam, forcing him to take shelter in a police station.

బీజేపి నేత దాష్టికం.. కన్న కూతురినే..

Posted: 02/18/2019 11:21 AM IST
Bjp leader arrested for alleged role in his daughter s kidnap

తన రాజకీయ ఎదుగుదలకు కన్న కూతురినే పావుగా వాడుకున్నాడు ఓ బీజేపి నాయకుడు. ఒక్కసారిగా తాను రాజకీయంగా పావులర్ కావాలని భావించిన నేత తన కూతురినే కిడ్నాప్ చేయించి డ్రామాకు తెరతీశాడు. అంతేకాదు తనకు ప్రత్యర్థిగా వున్న టీఎంసీ నేత, ఎమ్మెల్యే మణిరుల్ ఇస్లామ్ ఇంటిపై కూడా దాడికి పాల్పడి రాజకీయాన్ని ప్రదర్శించాడు. ఒక్క దెబ్బకు రెండు పాములు అన్న విధంగా వ్యవహరించిన ఆయన రాజకీయ చాణక్య వ్యూహాన్ని పోలీసులు కూడా అంతే చాకచక్యంగా చేధించి.. డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ బీజేపీ నాయకుడి కుమార్తెను అగంతకులు తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ కేసును 24 సవాల్ గా స్వీకరించిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి, విస్తుపోయే నిజాన్ని వెల్లడించారు. ఈ కిడ్నాప్ కు అసలు కారణం, ఆ అమ్మాయి కన్న తండ్రి, స్థానిక బీజేపీ నేత సుప్రభాత్ బత్యాబ్యాల్ అని, అతనితో పాటు కిడ్నాప్ కు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని బీర్భూమ్ ఎస్పీ శ్యామ్ సింగ్ తెలిపారు.

రాజకీయం కోసం కూతురి జీవితాన్ని పన్నంగా పెట్టిన వ్యక్తి గురించి మరిన్నీ వివరాలు సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను మీడియాకు తెలిపిన ఆయన, ఆ యువతిని ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో గుర్తించి కాపాడామని అన్నారు. ఆదివారం ఉదయం డాల్ ఖోలా రైల్వే స్టేషన్ సమీపంలో 22 సంవత్సరాల సుప్రభాత్ కుమార్తెను తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ప్రాథమిక విచారణలోనే పోలీసులకు సుప్రభాత్ మీదే అనుమానం వచ్చింది. ఆపై పోలీసు బృందాలు చకచకా కదిలాయి.

ఈ ఉదయం ఆమెను రక్షించామని, కుటుంబ సమస్యలతో పాటు, రాజకీయంగా పాప్యులర్ కావాలన్న కోరికతో సుప్రభాత్ ఈ కిడ్నాప్ కు ప్లాన్ చేశాడని భావిస్తున్నామని వెల్లడించారు. ఐదు నెలల క్రితం వరకూ తృణమూల్ నేతగా ఉన్న ఆయన, ఆపై బీజేపీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు యువతిని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఈ కిడ్నాప్ వార్త బయటకు వచ్చిన తరువాత టీఎంసీ నేత, ఎమ్మెల్యే మణిరుల్ ఇస్లామ్ ఇంటిపై దాడి జరిగిందని, దీని వెనుక కూడా సుప్రభాత్ హస్తం ఉండివుండవచ్చని అనుమానిస్తున్నామని, కేసును లోతుగా విచారిస్తున్నామని శ్యామ్ సింగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal  BJP  Prathama Batabyal  Suprabhat Batabyal  Kidnap  Gun point  West Bengal  Politics  

Other Articles