nagababu condems package allegations ఫ్యాకేజీ అరోపణలపై నాగబాబు ఘాటు స్పందన

Nagababu says pawan jana sena will bring change in politics

pawan kalyan, janasena, Pawan Kalyan naga babu, nagababu, chiranjeevi, prajarajyam, YSRCP, TDP, andhra pradesh, politics

Mega brother Nagababu says Jana Sena Chief Pawan Kalyan is strong enough to face any circunstances in politics to give transperencyu govt to people of Andhra Pradesh.

ITEMVIDEOS: ఫ్యాకేజీ అరోపణలపై నాగబాబు ఘాటు స్పందన

Posted: 02/18/2019 10:26 AM IST
Nagababu says pawan jana sena will bring change in politics

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుళ్లు రాజకీయాల్లో నెగ్గుకువచ్చే వ్యక్తిగా, నేతగా తయారవుతున్నాడని, ఇక అవినీతి లేని పాలన, పారదర్శక ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందో కూడా అందించనున్నాడని, ఇకపై జనసేన ఒక పార్టీగా కాకుండా ఒక శక్తిగా బలం పుంజుకుంటుందని నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవర్ పాలిటిక్స్ కోసం ప్రయత్నాలు చేస్తే తప్పులేదని అభిప్రాయపడిన ఆయన.. అవినీతికే పెద్దపీట వేసే ప్రభుత్వాల వల్లే ప్రజలకు పెనునష్టం వాటిల్లుతుందని అన్నారు.

పవన్ కల్యాణ్ జనసేనను అడ్డుపెట్టుకుని ప్యాకేజీలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇలాంటి తప్పుడు అరోపణలు చేస్తున్న వారెవరో తమకు తెలుసని అన్నారు. మళ్లీ అధికారానికి ఎక్కడ దూరం అవుతామోనని భయాందోళన చెందుతున్న వారే ఇలాంటి తప్పుడు ఆరోపణలను సృష్టిస్తున్నారని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కల్యాణ్ బాబు ప్యాకేజీలు తీసుకున్నారా? ఆయనకా అవసరం ఏంటి? వాళ్లు ఇచ్చేది ఎంత? పవన్ సినిమాలు చేస్తే ఏడాదికి రూ.150 కోట్లు సంపాదించే సత్తా పవన్‌కు ఉందని ఆగ్రహంతో ఊగిపోయారు. మరోసారి ఇటువంటి కామెంట్లు చేస్తే జనాగ్రహానికి గురికాక తప్పదని మండిపడ్డారు.

అయితే చిరంజీవి ప్రజారాజ్యానికి పవన్ కల్యాణ్ జనసైన్యానికి మధ్య చాలా వత్యాసం వుందని అన్నారు నాగబాబు. పవన్ కల్యాణ్ చిరంజీవిలా సున్నిత మనస్కుడు కాదని.. పవన్ చాలా గట్టి వ్యక్తిని, దేనికైనా ఎదురు తిరగగలిగే దైర్యం, మడమ తిప్పని మనస్తత్వం కలిగిన వాడని అన్నారు. తాను అనుకున్న దానిని సాధించేందుకు పోరాటం చేయడంలోనూ అవసరమైతే యుద్దం చేయడానికి కూడా వెనుకాడని వ్యక్తి పవన్ అన్నారు. ఇక టీడీపీతో కలసి పవన్ క్యలాన్ ప్రచారం చేశారన్న వార్తలను నాగబాబు ఖండించారు.

2014లో వైఎస్సార్ సిపీకి అనుకూలంగా ఒక తరంగం ఉండిందని చోప్పుకోచ్చిన ఆయన.. అప్పుడే విడిపోయిన రాష్ట్రం అభివృద్ది పథంలో సాగాలంటే రాష్ట్రానికి అనుభవం వున్న నాయకుడు అయితేనే మంచిదని భావించిన పవన్ కల్యాణ్ చంద్రబాబుకు, టీడీపికి మద్దతు ప్రకటించారని.. దీంతో అప్పట్లో రాష్ట్రంలో వున్న ఓటర్ల ఒరవడిని వైసీపీ నుంచి టీడీపీ వైపు తిప్పగలిగారని ఆయన చెప్పారు. అయితే ముందుగా ఆయన కేంద్రంలో బీజేపికి అనుకూలంగా ప్రచారం చేశారని, ఆ తరువాత చంద్రబాబు వినతి మేరకు టీడీపీకి ప్రచారం నిర్వహించారని నాగబాబు గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  nagababu  chiranjeevi  prajarajyam  andhra pradesh  politics  

Other Articles