Leopard in Icrisat still on the loose ఇక్రీశాట్ లో చిక్కని చిరుత.. గుప్పిట ప్రాణాలతో విధులకు సిబ్బంది..

Two traps set in icrisat but leopard still on the loose

leopard in ICRISAT, leopard in patancheru, leopard in hyderabad, leopard in Telangana, ICRISAT, locals feared of leopard, locals scared of leopard, WhatsApp, mukka anjamma, Kranti Priya, velimela, station nagulapally, Ramachandrapuram, Patancheru

Forest department officials have set up at least two cage traps with goats tied as bait to capture the leopard that strayed into the campus of ICRISAT in Patancheru last week.

ITEMVIDEOS: ఇక్రీశాట్ లో చిక్కని చిరుత.. గుప్పిట ప్రాణాలతో విధులకు సిబ్బంది..

Posted: 02/13/2019 02:40 PM IST
Two traps set in icrisat but leopard still on the loose

సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం మండలాల ప్రజలు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ సమీపంలోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌)లో చిరుత పులి సంచారం చేస్తుందన్న వార్తలు వీరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఇక్రీశాట్ లోని ఫీల్డ్ సిబ్బంది కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే వీరు పనులు నిర్వహించే ప్రదేశాలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక్రీశాట్ అధికారులు.

అయితే ఎంత భద్రత వున్నా ఫీల్డ్ లో పనులకు వెళ్లేందుకు మాత్రం అధికమంది సిబ్బంది జంకుతున్నారు. దీంతో ఇక్రిశాట్ లో పరిశోధనలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్రిశాట్లో వారం రోజులుగా చిరుత తిరుగుతున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆదివారం సాయంత్రం 6.44 గంటల సమయంలో ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో ఇది రికార్డు కూడా అయింది. అప్పటినుంచి క్షేత్ర స్థాయి పరిశోధనలు నిలిపివేశారు. ఇక్రిశాట్లో సుమారు 40 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిశోధనలు చేస్తున్నారు. చిరుత సంచారంతో ప్రస్తుతం వారందరూ ల్యాబ్‌లకే పరిమితమవుతున్నారు.

సోమవారం రాత్రి సమయంలో చిరుత ఓ ముళ్లపందిని తిన్న ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాని అడుగుజాడలను పర్యవేక్షించేందుకు 11 మంది సిబ్బందిని నియమించారు. దాని కదలికలను నిత్యం పర్యవేక్షించేందుకు 13 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. చిరుత సోమవారం రాత్రి సమయంలో అధికారులు ఏర్పాటు చేసిన ఓ బోను వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయినట్టు కెమెరాల్లో కనిపించింది. బోను లోపలికి రావడానికి చిన్న మేకను ఎరగా వేశారు. రెండు బోనుల్లో రెండు మేకలు అది స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు.

గతంలోనూ ముచ్చెమటలు పట్టించిన చిరుత..

ఇక్రిశాట్ లో చిరుత చోరబడటం.. ఇదే తొలిసారి కాదు. 2014లో కూడా చిరుత సంచరించి సిబ్బందిని, సమీప గ్రామస్థులను భయానికి గురిచేసింది. అప్పుడు కూడా అటవీశాఖ అధికారులు సుమారు నాలుగు రోజుల శ్రమించారు. అయితే అధికారుల ప్రయత్నాలకు చెక్ పెట్టిన చిరుత.. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. కాలక్రమేనా అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. కనీసం ఇక్రిశాట్ యాజమాన్యం కానీ, అటవీశాఖ అధికారులు కానీ చిరుత ఎటువెళ్లిందన్న దానిపై అధ్యయనం చేయలేదు. ఫలితంగా మళ్లీ ఐదేళ్ల తరువాత చిరుత జాడ పునరావృతం అయ్యింది. మరి ఈ సారైనా అధికారులు దీనిని పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leopard  ICRISAT  RCPuram  Patancheru  Vikarabad  Telangana  

Other Articles