AP govt good news to sankranti passengers సంక్రాంతి ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Andhra pradesh govt good news to sankranti passengers

Andhra pradesh, telangana, low temperatues, toll tax, sankranti, traffic hurdle, festive passengers, telugu states

Andhra pradesh government send good news to sankranti passengers, lifts up toll tax for festive passengers. which created a traffic hurdle for the passengers to reach their destination in time.

సంక్రాంతి ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Posted: 01/12/2019 07:31 PM IST
Andhra pradesh govt good news to sankranti passengers

తెలుగు రాష్ట్రాలు అప్పుడే సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. పండగ కోసం ప్రజలంతా పట్నం నుంచి పల్లెలకు తరలివెళ్తున్నారు. కొందరు రైళ్లలో, మరికొందరు బస్సుల్లో, ఇంకొందరు సొంత వాహనాల్లో.. ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. ప్రధానంగా, హైవేల మీద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీనుంచి తరలివస్తున్న వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది.

పండగ కోసం ఊరికెళ్తున్న జనాలకు.. నరకం కనిపిస్తోంది. దీంతో, పండగ వేళ సొంతూరు ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీనికితోడు టోల్ ట్యాక్స్ పేరిట జేబులకు భారీగా చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్‌ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల 12, 13, 16 తేదీల్లో ట్యాక్స్ వసూలును నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.

దీంతో సొంతూరు వెళ్తున్న ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. దీని వల్ల ప్రధాన రహదారులపై టోల్‌ట్యాక్స్ పేరిట జేబులకు చిల్లులు పడడం తగ్గడంతో పాటు, ట్రాఫిక్ జామ్‌లకు కూడా ఆస్కారం ఉండదు. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీ వెళ్లే ప్రధాన రహదారులన్నింటిపైనా.. భారీగా టోల్ ప్లాజాలు ఉన్నాయి. దీంతో భారీగా ట్యాక్సులు చెల్లించాల్సి వచ్చేది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం ప్రయాణికులకు భారీగా ఊరట కలిగించిందనే చెప్పాలి. అయితే, ఏపీ ప్రభుత్వం నిర్ణయం స్టేట్ హైవేస్ మాత్రమే వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ ఉన్న స్టేట్ హైవేస్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందంటున్నారు. మిగితా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా వసూళ్లు కొనసాగుతున్నాయి. నేషనల్ హైవేస్ నుంచి సమాచారం వస్తే తప్ప.. ఆపేది లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles