NCW notice to Rahul Gandhi over 'mahila' remark రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమీషన్ షాక్.!

Rahul gandhi slapped with ncw notice over mahila comment

National Commission for Women, Congress, Rahul Gandhi, Rahul Gandhi sexist remark, Nirmala Sitharaman, Rahul Gandhi rally, rahul gandhi news, rafale deal, rafale deal explained, rafale news, rafale deal price, rafale supreme court, rafale reliance, PM Modi. Political vendatta, Politics

The National Commission for Women (NCW) has issued a notice to Congress president Rahul Gandhi over his sexist remark involving Defence minister Nirmala Sitharaman made during a rally in Jaipur

రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమీషన్ షాక్.!

Posted: 01/10/2019 03:52 PM IST
Rahul gandhi slapped with ncw notice over mahila comment

అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనమైన రాఫెల్ డీల్ అంశంలో రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు, అందుకు సరైన బదులు రాకపోవడంతో ట్విట్టర్ లో చేసిన కామెంట్లు.. పక్కనబెడితే ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమీషన్ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ ‘మోసపూరితమైన, అనైతిక’ వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటులో రఫేల్‌ ఒప్పందంపై సీతారామన్‌ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తనను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది.

‘56 అంగుళాల ఛాతీ గల వాచ్‌మ్యాన్‌ పారిపోయి ఓ మహిళకు చెప్పారు.. సీతారామన్‌ జీ, నన్ను కాపాడండి.. నన్ను నేను కాపాడుకోలేను అని అడిగారు. రెండున్నర గంటల పాటు ఆమె ఆయనను రక్షించలేకపోయారు. నేను నేరుగా ఓ ప్రశ్న అడిగాను. యస్‌ లేదా నో అని సమాధానం చెప్పమన్నాను. కానీ ఆమె చెప్పలేదు’ అని రాహుల్‌ ఓ ర్యాలీలో అన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తప్పుపట్టింది. ఆయన మహిళల్ని గౌరవించాలని కమిషన్‌ ఛైర్ పర్సన్‌ రేఖా శర్మ వెల్లడించారు. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, నిర్మలా సీతారామన్ కు క్షమాపణలు చెప్పాలని నోటీసులలో పేర్కోన్నారు. ఆమె రక్షణ శాఖ మంత్రి అని, ఓ పార్టీ అధ్యక్షుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను తాము ఊహించలేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles