Bengal IAS Officer Beats up Youth at Police Station యువకుడిపై విరుచుకుపడిన ఐఏఎస్ అధికారి. అతని భార్య

Ias officer thrashes youth for making lewd comments on wife s facebook profile

West Bengal, IAS officer viral video, Nikhil Nirmal, Alipurduar District Magistrate, facebook, lewd messages, Falakata Police Station, inspector-in-charge, Soumyajit Ray, video viral

A viral video, which surfaced has left the West Bengal government officials in a tizzy as it shows a Bengal cadre IAS officer assaulting a youth inside a police station.

ITEMVIDEOS: యువకుడిపై విరుచుకుపడిన ఐఏఎస్ అధికారి

Posted: 01/07/2019 12:25 PM IST
Ias officer thrashes youth for making lewd comments on wife s facebook profile

సినిమాల ప్రభావం ఐఏఎస్ అధికారులపై కూడా వుందా.? ఒక జిల్లాను తమ పరిపాలనలో ముందుక తీసుకెళ్లే అధికారులు కూడా తమకు కోపం వస్తే చావచితక కోడతారని ఈ ఘటన నిరూపిస్తుంది. సింగం కలెక్టర్ గా పేరుతెచ్చుకున్న ఈ కలెక్టర్ తన భార్య ఫేస్ బుక్ అకౌంట్ల్ లో ఓ యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతడికి గుణపాఠం చెప్పాడు. అతని భార్యా పేస్ బుక్ ప్రొఫైల్ తెరచిన యువకుడు అమపై అనుచిత కామెంట్ పెట్టాడు. దీంతో యువకుడిని కలెక్టర్ తో పాటుగా అతని భార్య కూడా చావచితకగొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పశ్చిమ బెంగాల్ లో అలిపూర్ ద్వార్ జిల్లా కలెక్టరుగా కేరళకు చెందిన 2011బ్యాచ్ ఐఏఎస్ అధికారి నిఖిల్ నిర్మల్ పనిచేస్తున్నారు. అతని భార్య ఫేస్ బుక్ ప్రొపైల్ పై అనుచిత కామెంట్ రావడాన్ని గమనించిన ఆయన ఇందుకు బాధ్యుడైన స్థానిక యువకుడిని లోకల్ ఫలకట్టా పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్నారు. అతన్ని ఎందుకిలా చేశావ్ అని విచారించాల్సిన బదులు.. యువకుడు రావడంతోనే అతన్ని చావచితకగొట్టాడు. రెండు చెంపలు వాయించాడు. తన భార్య, పోలీసులు, కొందరు అధికారుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. క్షమించండంటూ ఆ యువకుడు కాళ్లపై పడి వేడుకున్నా కలెక్టర్ కనికరించలేదు.

‘నా జిల్లాలో ఇలా చేయడానికి నేను అనుమతించను. మీ ఇంట్లోకి వచ్చి నిన్ను చంపేస్తా’ అంటూ కలెక్టర్ బెదిరించాడు. కలెక్టర్ భార్య కూడా కోపంతో అతన్ని కొట్టేందుకు ప్రయత్నించింది. అక్కడున్న వారిని లాఠీ ఇవ్వాలని అడిగింది. నీ చేత ఎవరు అలాంటి కామెంట్ పెట్టించారో చెప్పాలంటూ ఆ యువకుడిని కలెక్టర్ గారి భార్య నిలదీసింది. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే...ఈ తతంగమంతా జరిగింది. జిల్లా కలెక్టర్, ఆయన భార్య చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, అంతా తామే అన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మీడియా ప్రశ్నించేందుకు జిల్లా కలెక్టర్ నిర్మల్, పోలీసు అధికారులు నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAS officer  youth  facebook  viral video  West Bengal  

Other Articles