Famous film producer charged in rape case సినిమా ఛాన్స్ పేరుతో అత్యాచారం.. నిర్మాతపై కేసు

Rape case registered against kerala film producer vaishak rajan

producer sexual assault on model, producer charged in rape case, producer rapes model, Model, cinima chance, Malayalam, film producer, Vaishak Rajan, Ernakulam North police station, Mollywood, crime

A rape case has been registered against Malayalam film producer Vaishak Rajan at the Ernakulam North police station. The station sub inspector has confirmed that the case has been registered under Section 376 (Punishment for Rape).

సినిమా ఛాన్స్ పేరుతో అత్యాచారం.. నిర్మాతపై కేసు

Posted: 01/05/2019 10:07 AM IST
Rape case registered against kerala film producer vaishak rajan

ఓ నటి తన అక్రమ సంబంధాల విషయాలను తన మొదటి భార్యతో చెప్పి తనకు దూరం చేసిందని అమెపై ప్రతీకారంతో కిడ్నాప్ చేయించి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రముఖ హీరో దిలిప్ పై నమోదైన కేసు విచారణ సాగుతున్న క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ చిత్ర నిర్మాత ఓ మోడల్ కు సినిమా అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి అమెపై అత్యాచారం చేసిన ఘటన తాజాగా మాలీవుడ్ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

ప్రముఖ నిర్మాత వైశాక్ రాజన్ పై ఉత్తర ఎర్నాకుళం పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ మేరకు అత్యాచార కేసు నమోదైంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. నిర్మాత తనకు సినీ అవకాశాల ఆశ చూపి తనపై అత్యాచారం చేశాడని ఓ మోడల్ పిర్యాదు చేయడంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశామని ఉత్తర ఎర్నాకుళం పోలిస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పిన ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

సినిమా అవకాశాలు కల్పిస్తామని, వర్థమాన సినీనటి, మోడల్ ను నమ్మించిన నిర్మాత అమెను 2017లో ఎర్నాకుళంలోని కత్రికదావులో వున్న తన ఫ్లాట్ కు తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడని మోడల్ తన పిర్యాదులో పేర్కోంది. ఆ తరువాత విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిర్మాత నుంచి బెదిరింపులకు కూడా ఎదుర్కోన్న అమె ఏడాదిన్నర తరువాత ధైర్యం కూడగట్టుకుని అతనిపై పిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles