politics on the movie The Accidental Prime Minister ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’పై రాజకీయ రగడ

Youth congress demands pre release show of the accidental prime minister

The Accidental Prime Minister, Anupam Kher, ManMohan singh, theatrical trailer, Sanjaya baru, Sonia Gandhi, sujane, Rahul Gandhi, Akshay khanna, Congress, BJP, National politics

The Youth Congress wrote to the makers of The Accidental Prime Minister, demanding a special pre-release screening of the movie, while threatening to protest against its release if this was not done.

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’పై రాజకీయ రగడ

Posted: 12/28/2018 07:35 PM IST
Youth congress demands pre release show of the accidental prime minister

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ట్రైలర్‌ విడుదల కావడంతో ఇప్పుడా సినిమా చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంటోంది. ట్రైలర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సినిమాలో వాస్తవాల్ని వక్రీకరించారని ఆరోపిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సినిమాను ముందే చూపించకుంటే అడ్డుకుంటామని హెచ్చిరిస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

వాస్తవాలు బయటికి వస్తాయని కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేసింది. ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ట్రైలర్ గురువారం విడుదలైంది. మన్మోహన్‌సింగ్‌ పాత్రను బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్‌ పోషించగా.. సోనియాగాంధీ పాత్రను ఇంగ్లీష్‌ నటి సుజానే పోషించారు. ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తక రచయిత సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. మన్మోహన్‌ నడక, వేషభాషలను ఖేర్ అచ్చుగుద్దినట్లు దించేశారు. సినిమా జనవరి 11న విడుదలకానుంది.

ఈ చిత్రంపై మన్మోహన్ సింగ్ పాత్రధారి అనుపమ్ ఖేర్ స్పందించారు. సినిమాను ఎంతగా వ్యతిరేకిస్తే అంతగా ప్రచారం పెరుగుతుందన్నారు. 'నటుడి పని నటించడమే. ఫిల్మ్‌మేకర్ పని ఫిల్మ్ రూపొందించి జనం ముందుకు తీసుకువెళ్లడం. అలాగే కొన్ని రాజకీయ ఆర్గనేజేషన్లు తమ పని తాము చేస్తుంటాయి. వాళ్లకి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేద'ని అన్నారు. 'వారి రాజకీయ పార్టీ (కాంగ్రెస్) చట్టానికి అతీతమని భావిస్తే అప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Accidental Prime Minister  ManMohan singh  Sonia Gandhi  Rahul Gandhi  Congress  BJP  politics  

Other Articles