ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానంటూ వెంట పడి వేధిస్తూ.. శారీరిక సంబంధం కోసం వత్తిడి చేస్తున్న యువకుడికి గుణపాఠం చెప్పే క్రమంలో కటకటాలపాలైన వివాహిత ఉదంతం ముంబయి నగరంలో సంచలనం రేపింది. ముంబయి నగరంలోని డోంబివలికి చెందిన 47 ఏళ్ల వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. గృహరుణాలు ఇప్పించే ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న తుషార్ పుజారే (27) అనే యువకుడు అమె పొరిగింట్లోనే నివాసం వుంటున్నాడు.
గత కొంతకాలంగా వివాహితను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి తన కోరిక తీర్చమంటూ వేధిస్తున్నాడు తుషార్. తాను వివాహితనని, తనకు భర్తతోపాటు ఇద్దరు పిల్లలున్నారని చెప్పి వివాహిత యువకుడి ప్రేమను తిరస్కరించింది. అయినా మాట వినని తుషార్ పుజారే వివాహిత భర్తను కలిసి తాను అతని భార్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. దీంతో వివాహితపై ఆమె భర్తకు అనుమానం ఏర్పడి, కుటుంబకలహాలు రేగాయి.
దీంతో ఆగ్రహం చెందిన వివాహిత కీచకుడైన తుషార్ పుజారేకు గుణపాఠం చెప్పాలని తనకు తెలిసిన ఇద్దరు యువకులతో కలిసి ఓ పథకం వేసింది. తేజాస్ మహాత్రే(22), ప్రవీణ్ కెనియా (25) లతో కలిసి వివాహిత రాత్రి 9 గంటలకు తమకు ఇంటి రుణం కావాలని చెప్పి తుషార్ ను రప్పించి వారితో కలిసి కొట్టింది. అనంతరం పదునైన కత్తి తీసుకొని తుషార్ పురుషాంగాన్ని కోసింది. అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న తుషార్ ను యువకులతో కలిసి వివాహిత ఆసుపత్రిలో చేర్చింది.
అస్పత్రిలో వైద్యుల ఎదుట అమె తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. అయితే తాను ఒక్కదాన్నే ఈ నేరానికి పాల్పడ్డానని చెప్పినా.. నమ్మని పోలీసులు తమదైన శైలిలో విచారించిన తరువాత అమె ఇద్దరు నిందితుల పేర్లను బయటపెట్టింది. ప్రస్తుతం తుషార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు తుషార్ పురుషాంగంతోపాటు కత్తిని స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితురాలైన వివాహితతోపాటు తేజాస్ మహాత్రే(22), ప్రవీణ్ కెనియా (25) లను అదుపులోకి తీసుకున్నారు. ముంబయి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more