17 dead after bus falls into gorge in Poonch జమ్మూకాశ్మీర్: లోయలో పడిన బస్సు.. 17 మంది మృతి

Jammu and kashmir 17 dead after bus falls into gorge in poonch

bus falls in gorge, bus accident in JK, jammu and kashmir, poonch, poonch accident, jammu and kashmir bus accident, mandi bus accident, poonch bus accident, Crime

Jammu and Kashmir tragedy: At least 17 people were killed after a bus skid off the road and fell into a deep gorge in Jammu and Kashmir.

ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడిన బస్సు.. 17 మంది మృతి

Posted: 12/08/2018 11:03 AM IST
Jammu and kashmir 17 dead after bus falls into gorge in poonch

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలో బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 23 మంది మరణించారని వార్తలు అందుతున్నాయి. పూంచ్ జిల్లాలోని ప్లేరా ప్రాంతంలోగల మండి తహసిల్ పరిధీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా, మరో 17 మంది తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇవాళ  వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న అధికారవర్గాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మండిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జైన బస్సు నుంచి మృతదేహాలను తీసేందుకు స్థానికులు కూడా అధికారులకు సాయం చేసేందుకు ముందుకువచ్చారు. అయితే మంచు కురుసిన రోడ్డుపై వెళ్తున్న బస్సులో సరిగ్గా స్థానికంగా ప్రవహించే ఓ నదికి చేరువలో వెళ్తుండగా, జారిన బస్సు అదుపుతప్పి లోయలో పడిందని సమాచారం.

లోర‌న్ నుంచి పూంచ్ వైపు వెళ్తున్న బస్సు.. మండి ప్రాంతంలోని ప్లేరాలోని లోయ‌లో ప‌డింది. విషయం తెలుసుకున్న అధికారులు అలర్టయ్యారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారందరి మృతదేహాలను తాము గాలించామని, అందరి మృతదేశాలను స్థానిక అసుపత్రిలో వుంచామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన విషమపరిస్థితుల్లో వున్న వారిని హెలికాప్టర్ ద్వారా జమ్మూలోని అసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gorge  bus accident  mandi  poonch  jammu and kashmir  crime  

Other Articles